WIPRO Recruitments : విప్రో రిక్రూట్‌మెంట్.. వీరికే ప్రాధాన్యత.. వర్క్ ఫ్రం హోం కూడా.. ముఖ్యమైన వివరాలివే..

సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. విప్రో జాబ్ రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. పాపులర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో ప్రకటన, మంచి ఎంట్రీ-లెవల్ కెరీర్ అవకాశాలను అందిస్తుంది.
ఉద్యోగ వివరాలు..
విప్రో అందిస్తున్న ఉద్యోగాలు చాలావరకు వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించినవే. ఇందులో, అభ్యర్థులు ఫుల్ టైం
లేదా, పార్ట్ టైం కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మల్టిపుల్ లొకేషన్ల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. దీనికి, ఫ్రెషర్స్ లేదా నాలుగేళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు.
Jobs For Unemployed Youth: గుడ్‌న్యూస్.. 60 పోస్టులు, జీతం రూ.2,00,000/-
మరిన్ని వివరాలను విప్రో అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్‌ని ప్రధానంగా విప్రో కంపెనీ పరీక్షిస్తుంది. హైరింగ్ ప్రాసెస్‌లో వివిధ దశలు ఉంటాయి.
ఉద్యోగాలివే..
టెక్నాలజీ & ఇంజనీరింగ్
ఇందులో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రోల్స్ ఉంటాయి. దీనికి, టెక్నాలజీపై ఆసక్తి, పట్టు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు.
కన్సల్టింగ్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
విప్రో బిజినెస్ ఇన్నోవేషన్, స్ట్రాటెజిక్ సొల్యూషన్స్ అందించగల ప్రొఫెషనల్స్ కోసం చూస్తోంది. ఇందులో ఆసక్తి ఉన్నవారు, అనుభవం గలవారు దరఖాస్తులకు అర్హులు.
Amazon Layoffs In 2025: ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్ చెప్పిన అమెజాన్.. భారీగా ఉద్యోగుల తొలగింపు?
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & సెక్యూరిటీ సర్వీసెస్
ఐటీ సపోర్ట్ అండ్ సెక్యూరిటీ లో అవకాశాలు అందిస్తోంది. నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, ఐటీ సపోర్ట్, సైబర్ సెక్యూరిటీ రోల్స్ అందిస్తోంది.
ముఖ్య వివరాలు..
దరఖాస్తులు- ఆన్‌లైన్‌లో.. అభ్యర్థి రెజ్యూమ్, అవసరమైన డాక్యుమెంట్స్‌ను విప్రో అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
ఎంపిక విధానం- రాత పరీక్షతో.. ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్‌ని అంచనా వేస్తారు.
మూడో రౌండ్‌లో ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ మొదలైన వాటికి సంబంధించిన అసెస్‌మెంట్స్ నిర్వహిస్తారు.
చివరిగా టెక్నికల్, హెచ్ ఆర్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఇక టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, విప్రో కోర్ వ్యాల్యూస్‌తో అభ్యర్థి ఎంత వరకు సరిపోతాడనే అంశాలపై ఎంపిక ఆధారపడి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- wipro recruitments
- job notifications for unemployed youth
- software recruitments
- wipro 2025
- wipro job notifications
- eligibilities for wipro jobs
- freshers at wipro
- work from home jobs
- wfh jobs 2025
- wipro wfh jobs
- written exam for wipro jobs
- job opportunities
- wipro recruitments in technical teams
- artificial intelligence
- cloud computing
- technology and engineering
- Education News
- Sakshi Education News