Skip to main content

AP Panchayat Raj Department jobs: AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టుల భర్తీకి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ

Andhra Pradesh government job recruitment update  AP Deputy CM Pawan Kalyan   Panchayati Raj recruitment in Andhra Pradesh   Deputy CM Pawan Kalyan issues job instructions  1488 vacancies in Panchayati Raj Department
AP Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో త్వరలో 1488 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆమోదం లభిస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది. 

డిగ్రీ అర్హతతో పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 20వేలు: Click Here

ఈ 1488 పోస్టులు భర్తీ వివరాలు:
రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 2917 మంది ఉద్యోగులు మరణించారు. వీరిలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెక్టరేట్ పరిధిలో 330 మంది , కార్పొరేషన్లు మరియు సొసైటీలకు సంబంధించిన 560 మంది, యూనివర్సిటీలో 83 మంది మరణించడం జరిగింది.

ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాల కోసం 2744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. 

ఆదేశాలు జారీ:
ఈ సమస్యను మరణించిన ఉద్యోగుల కుటుంబాలు ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడంతో అయినా అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
ఈ ఉద్యోగాలు భర్తీకి చర్యలు ప్రారంభించిన అధికారులు ఉద్యోగాల భర్తీ ఫైల్ ను ఆర్థిక శాఖకు పంపించారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి గారు వద్దకు చేరింది. ముఖ్యమంత్రి ఈ ఫైల్ పై సంతకం చేస్తే త్వరలో 1488 పోస్టులు భర్తీ జరగనుంది.

 

Published date : 31 Jan 2025 08:47AM

Photo Stories