Skip to main content

Job Mela : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు ఈ నెల 28న జాబ్ మేళా

job mela
job mela

ప్రొద్దుటూరు: ఈ నెల 28వ తేదీన జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యాన స్థానిక ఎస్‌సీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(ఆర్ట్స్‌కాలేజీ)లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌, జేకేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.శశికాంత్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్కూల్స్‌కు సెలవు లేదు ఎందుకంటే..!: Click Here

కడప కొప్పర్తిలోని ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ కంపెనీలో అసెంబ్లింగ్‌ ఆపరేటర్‌, హెల్పర్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, ఐటీఐ/డిప్లొమా, బీటెక్‌ (ఈసీఈ, ఈఈఈ) చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 28న ఉదయం 9 గంటలకు జాబ్‌ మేళాలో పాల్గొనాలని, మరిన్ని వివరాలకు 9573321678 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

Published date : 26 Mar 2025 06:26PM

Photo Stories