Skip to main content

Indian Railways Teacher jobs: డిగ్రీ అర్హతతో భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలు జీతం నెలకు 27,500

Indian Railways Teacher jobs
Indian Railways Teacher jobs

నిరుద్యోగులకు శుభవార్త ! భారతీయ రైల్వే సంస్థలో టీచర్స్ గా పనిచేసేందుకు గాను అవకాశం కల్పిస్తూ, నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందు నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే సరిపోతుంది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : మొత్తం 37 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు  రైల్వే స్కూల్ – DV(గర్ల్స్), DV (బాయ్స్) & CHS(EM) / CLW / చిత్తరంజన్ వద్ద పనిచేయాల్సి వుంటుంది.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT) – 21

  • PGT (ఫిజిక్స్)
  • PGT (కెమిస్ట్రీ)
  • PGT (మాథెమాటిక్స్)
  • PGT (కంప్యూటర్)
  • PGT (హింది)
  • PGT (బెంగాలీ)
  • PGT (హిస్టరీ)
  • PGT (పొలిటికల్ సైన్స్)
  • PGT (జాగ్రఫీ)
  • PGT (ఎకానామిక్స్)
  • PGT (కామర్స్)


ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) – 11

  • TGT (ఇంగ్లీష్)
  • TGT (బెంగాలీ)
  • TGT (SST)
  • TGT (ఫిజిక్స్.కెమిస్ట్రీ.బయాలజీ)
  • TGT (ఫిజిక్స్.కెమిస్ట్రీ.మ్యాథ్స్)
  • TGT(హిందీ)

విద్యార్హత :

పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT):

  • సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ  లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత సాధించాలి.
  • B.Ed లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  • సంబంధిత భాషా మీడియం లో బోధించగలిగే నైపుణ్యత కలిగి వుండాలి.


ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT):
సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
                (లేదా)

సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి , బి. ఎడ్ (B.Ed) ఉత్తీర్ణత సాధించాలి.

(లేదా)

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన తత్సమాన అర్హత కలిగి వుండాలి.

ఇంటర్వ్యూ నిర్వహించే వేదిక : మీటింగ్ రూమ్ / జిఎం ఆఫీస్ బిల్డింగ్ / CLW / CR వద్ద నిర్వహిస్తారు.

జీతం : PGT గా ఎంపిక కాబడిన వారికి నెలకు 27,500/- రూపాయలు మరియు TGT గా ఎంపిక కాబడిన వారికి 26,250/- రూపాయలు జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు : ఏప్రిల్ 2025 లో తేది : 5, 7, 8, 9, 11, 12 లలో ఉదయం 09:30 నిముషాలకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలి.

Click here for notification

Click here for official website

Published date : 26 Mar 2025 06:16PM

Photo Stories