Skip to main content

AP ECHS PolyClinics jobs: 10వ తరగతి అర్హతతో AP ECHS పాలి క్లినిక్స్ లో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్యూన్ ఉద్యోగాలు జీతం నెలకు 28100

AP ECHS PolyClinics   ECHS Cell Visakhapatnam recruitment notification 2025  Government of India Ministry of Defence job openings  Medical, paramedical, and non-medical posts at ECHS Cell
AP ECHS PolyClinics

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ECHS Cell (ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సెల్) , విశాఖపట్నం నుండి మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.. 

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 
ఈ నోటిఫికేషన్ ద్వారా Oi/C పాలీ క్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, డెంటల్ A/T/H, IT నెట్వర్క్ టెక్నీషియన్, డ్రైవర్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిమేల్ అటెండెంట్, చౌకీదార్ సఫాయివాలా, ప్యూన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీలు సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లై విధానం : అర్హత ఉండేవారు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.

విద్యార్హతలు : పోస్టులను అనుసరించి 8వ తరగతి, డిప్లమో, డిగ్రీ, MBBS, BDS, GNM, బిఎస్సి నర్సింగ్, DMLT వంటి విద్యార్హతలు మరియు పని అనుభవం ఉండాలి.

కనీస వయస్సు : 

కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
18 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు.
గరిష్ట వయస్సు వివరాలు లేదు.

వర్క్ లొకేషన్ : అభ్యర్థులు ఎంపికైన పోస్టులను అనుసరించి శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడలో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు. 

అప్లికేషన్ ఫీజు : ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

జీతము : 
Oi/C పాలీ క్లినిక్ – 75,000/-
మెడికల్ ఆఫీసర్ – 75,000/-
డెంటల్ ఆఫీసర్ – 75,000/-
ల్యాబ్ అసిస్టెంట్ – 28,100/-
ల్యాబ్ టెక్నీషియన్ – 28,100/-
ఫార్మసిస్ట్ – 28,100/-
నర్సింగ్ అసిస్టెంట్ – 28,100/-
డెంటల్ A / T / H – 28,100/-
IT నెట్వర్క్ టెక్నీషియన్ – 28,100/-
డ్రైవర్ – 19,700/-
క్లర్క్ – 19,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 16,800/-
ఫిమేల్ అటెండెంట్ – 16,800/-
చౌకీదార్ – 16,800/-
సఫాయివాల – 16,800/-
ప్యూన్ – 16,800/-

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ , సమయం,  ప్రదేశం వివరాలు తెలియజేస్తూ టెలిఫోన్ లేదా ఈమెయిల్ లేదా SMS ద్వారా సమాచారం ఇస్తారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వెళ్ళాలి.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 31-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : OIC , Stn HQs (ECHS Cell) , Visakhapatnam, Nausena Baugh, PO – Gandhigram, Visakhapatnam, Andhra Pradesh , PIN – 530005

Download Notification: Click Here
 

Published date : 31 Jan 2025 08:51AM

Photo Stories