Skip to main content

Free training on photography and videography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

Free training on photography and videography  Free photography and videography training session in Chandragiri
Free training on photography and videography

చంద్రగిరి: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 20వ తేదీ (గురువారం) నుంచి 30 రోజుల పాటు మహిళలు, పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్‌ పీ.సురేష్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అర్హులని తెలిపారు.

ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు Work From Home: Click Here

కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని సూచించారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


ఆసక్తి గలవారు ఆధార్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్‌ (రాయల్‌ విక్టరీ స్కూల్‌ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్‌: 79896 80587, 94949 51289 సంప్రదించాలని పేర్కొన్నారు.

Published date : 20 Feb 2025 08:33AM

Photo Stories