Skip to main content

Women Employees Work From Home: ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు Work From Home

Women Employees Work From Home  Andhra Pradesh government initiative for womens remote work
Women Employees Work From Home

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళలకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇంటి నుంచే పని చేసే అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తుండగా, కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) కల్చర్ మరింత ప్రాచుర్యం పొందిందని అధికారులు చెబుతున్నారు.

సికింద్రాబాద్ రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం నెలకు 30,000: Click Here

WFH పై సీఎం చంద్రబాబు ప్రకటన

అంతర్జాతీయ మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఇంటి నుంచి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. మహిళలు తమ కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగాల్లోనూ సమర్థంగా రాణించేందుకు WFH ఉత్తమ ఎంపికగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంటి నుంచి పని చేసే అవకాశాలు – ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం

ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, హాస్పిటల్, టీచింగ్ విభాగాలు మినహా మిగిలిన శాఖల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐటీ ఉద్యోగులు, రిమోట్ వర్క్, కో-వర్కింగ్ స్పేస్‌లు, నెయ్బర్‌హుడ్ వర్క్ స్పేస్‌లను ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

మహిళల కోసం ప్రత్యేక అవకాశాలు

ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారి భారం తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్తమమైన పరిష్కారమని ముఖ్యమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ & జీసీసీ పాలసీ 4.0 – కొత్త మార్గదర్శకం

ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ద్వారా ప్రతి నగరం, పట్టణం, మండల స్థాయిలో ఐటీ హబ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. దీని ద్వారా చివరి స్థాయిలో ఉన్న మహిళా ఉద్యోగులు రిమోట్ లేదా హైబ్రిడ్ విధానంలో పనిచేసే అవకాశం పొందనున్నారు.

ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఉద్యోగుల కోసం ఒక కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టబోతోందని చంద్రబాబు నాయుడు అన్నారు.

Published date : 20 Feb 2025 08:26AM

Photo Stories