Skip to main content

Free training in tailoring: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free Training in Tailoring
Free Training in Tailoring

చంద్రగిరి: నారావారిపల్లిలో మహిళలకు ఉచిత టైలరింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సంకల్ప్‌ పథకం ద్వారా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి రెండు బ్యాచ్‌ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు Work From Home: Click Here

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రేణుక, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఏపీఎస్‌ఎస్‌డీసీలు హాజరై ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.

ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు అవసరమైన మేరకు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. నారావారిపల్లె, కందులవారి పల్లె, భీమవరం, శేషాపురంలో ఉన్నటువంటి ఎస్‌ఎస్‌జీ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం శిక్షణార్థులకు టైలరింగ్‌కు అవసరమైన మెటీరియల్‌ను అందజేశారు.

 

Published date : 20 Feb 2025 08:41AM

Photo Stories