Skip to main content

5th Class & Inter Admissions: గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా అప్లై చేసుకోండి

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 2025 – 26 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి నుంచి ఐఐటీ, నీట్‌ అకాడమీలో ప్రవేశానికి బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
5th Class & Inter Admissions  Nellore Ambedkar Gurukul Vidyalaya admission notice for IIT and NEET Academy 2025-26  District Coordinator Padmaja announces admissions for IIT and NEET Academy at Gurukul Schools  Application notice for class 5 and above girls in Ambedkar Gurukul IIT and NEET Academy
5th Class & Inter Admissions

ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు సెప్టెంబర్‌ ఒకటి, 2012 నుంచి ఆగస్ట్‌ 31, 2016 మధ్య.. బీసీ, ఓసీ విద్యార్థినులు సెప్టెంబర్‌ ఒకటి, 2014 నుంచి ఆగస్ట్‌ 31, 2016 మధ్య జన్మించి ఉండాలని చెప్పారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోరే వారు 2024 – 25 విద్యా సంవత్సరంలో పదో తరగతిని రెగ్యులర్‌ ప్రాతిపదికన చదివి ఉండాలని వివరించారు.

Free Training On Computer Skills: కంప్యూటర్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. 100% జాబ్‌ గ్యారెంటీ

గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలు | Admissions in 6th 7th  8th classes in Gurukul schools Andhra Pradesh | Sakshi

ఈ ఏడాది ఆగస్ట్‌ 31 నాటికి 17 ఏళ్లు మించి ఉండకూడదని తెలిపారు. apbragcet.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల ఆరో తేదీ సాయంత్రం ఐదు తర్వాత దరఖాస్తులను స్వీకరించబోమన్నారు. వివరాలకు 97045 50083, 97045 50096 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 20 Feb 2025 03:16PM

Photo Stories