Free Training On Computer Skills: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. 100% జాబ్ గ్యారెంటీ
Sakshi Education
నల్లగొండ : రెడ్డీస్ ఫౌండేషన్ గ్రో ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ ఆపరేటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టైపింగ్, సెక్టార్ రెడీనెస్, ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై రెండు నెలల శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు అల్మాస్ ఫర్హీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free Training On Computer Skills
ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అర్హతలు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులను గడియారం సెంటర్‌లో ఉన్న తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 70326 09925, 91777 85983 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.