Skip to main content

Certificate Course Interview: ఈనెల 24న సర్టిఫికెట్‌ కోర్సులకు ఇంటర్వ్యూ

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (గైస్‌)లో నిర్వహిస్తున్న స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Certificate Course Interview  Government Institute of Chemical Engineering short-term course interviews  GICE Kancharapalem admission interviews on 24th
Certificate Course Interview

2024–25 సంవత్సరానికి ఏడాది వ్యవధి కలిగిన పారిశ్రామిక భద్రత కోర్సులో 60 సీట్లు, 6 నెలల వ్యవధితో ఫైర్‌ సేఫ్టీ కోర్సులో 30 సీట్లు, 4 నెలల వ్యవధితో ఆఫీస్‌ ఆటోమేషన్‌ కోర్సులో 20 సీట్లు, 3 నెలల వ్యవధితో కెమికల్‌ సూపర్‌వైజరీ ప్రొగ్రామ్‌లో 20 సీట్లు ఉన్నాయన్నారు.

ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు టెన్త్‌ పాస్‌/డిప్లొమా/ఇంటర్‌/డిగ్రీ సరిఙ్టఫికెట్‌, ఆధార్‌, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీకరణపత్రం ఒరిజినల్‌తో పాటు ఒక సెట్‌ జెరాక్స్‌తో ఆ రోజు ఉదయం 10గంటలకు నేరుగా గైస్‌ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కోరారు.

Gurukulam Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పరీక్ష ఫీజు, ఎంపిక విధానం ఇలా..


ముఖ్య సమాచారం:

కోర్సు: సర్టిఫికేట్‌ కోర్సు
కోర్సు వివరాలు

  • పారిశ్రామిక భద్రత కోర్సు- 60  సీట్లు
  • ఫైర్‌ సేఫ్టీ కోర్సు- 30 సీట్లు
  • ఆఫీస్‌ ఆటోమేషన్‌ కోర్సు- 20 సీట్లు
  • కెమికల్‌ సూపర్‌వైజరీ ప్రొగ్రామ్‌- 20 సీట్లు

విద్యార్హత: టెన్త్‌ డిప్లొమా ఇంటర్‌ డిగ్రీ
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 24న

AP Intermediate public exams: మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. రేపట్నుంచే హాల్‌టికెట్స్‌ రిలీజ్‌

సమయం: ఉదయం 10 గంటలకు
ఎక్కడ: ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (గైస్‌),కంచరపాలెం.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 19 Feb 2025 03:44PM

Photo Stories