Skip to main content

Free Self Employment Courses: 30న ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు.. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం

రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్‌ నైరెడ్‌లో డిసెంబ‌ర్ 30న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్‌ ఎం. రాజేష్‌ డిసెంబ‌ర్ 26న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Interviews for employment training on 30   Self-employment training interview announcement Job training opportunity in Rajam  GMR Nayred facility for self-employment training

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ స్త్రీ, పురుషులు అర్హులని పేర్కొన్నా రు. పురుషులకు కంప్యూటర్‌ డీటీపీ (45 రోజులు), ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌ (30 రోజులు), ఫొటోగ్రఫీ అండ్‌ వీడియోగ్రఫీ (30 రోజులు), కారు డ్రైవింగ్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌ కలిగి ఉండాలి, 30 రోజులు), అలాగే స్త్రీలకు బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌ (30 రోజులు), హోమ్‌ నర్సింగ్‌ (30 రోజుల పాటు)లలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

చదవండి: REC Limited Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 74 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులతో పాల్గొనాలని సూచించారు. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించ నున్నామని తెలిపారు. వివరాలకు 90147 16255, 9491741129 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 28 Dec 2024 09:06AM

Photo Stories