IIIT-RK Valley: విద్యుత్ సరఫరా లేక పరీక్ష వాయిదా

ఆర్కే వ్యాలీ డైరెక్టర్ తెలిపిన వివరాల మేరకు.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో డిసెంబర్ 26న రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఆన్‌లైన్ విధానం ఉండడంతో.. ఇడుపులపాయలోని విద్యుత్ సరఫరా సమస్య వల్ల అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ ఉదయం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షను మధ్యాహా్ననికి వాయిదా వేశారు. చివరకు విద్యుత్ సిబ్బంది డిసెంబర్ 26న ఉదయం ఎనిమిది గంటల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
చదవండి: Top 10 Best Courses : జేఈఈ విద్యార్థులకు ఐఐటీ కోర్సులపై అవగాహన.. టాప్ 10 కోర్సులు ఇవే..!
వర్షం వల్ల డిస్క్‌లు కాలిపోవడం, బ్రేకర్‌లో బల్లులు పడడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యుత్ అధికారులు చెప్పారు. దీంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా లైను ట్రిప్ అయ్యిందన్నారు. వెంటనే డిస్క్‌లు మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వెంకట నాగేంద్ర చెప్పారు.