Skip to main content

Good News for Unemployees : గుడ్ న్యూస్‌.. ఈ టాప్ కంపెనీలో 40,000 ఉద్యోగాలు.. ఈ శిక్ష‌ణ‌తోనే డైరెక్ట్ జాబ్‌..!!

ఇప్పుడు ఉన్న పోటీ ప్ర‌పంచంలో ఎంత అనుభ‌వం, నైపుణ్యాలు ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగం దొర‌క‌డం క‌ష్టంగా మారింది. అటువంటి ఈ సమ‌యంలో 40,000 ఉద్యోగాలు ఉన్నాయంటూ ఈ టాప్ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో విద్యార్థులు, నిరుద్యోగుల‌కు శుభ‌వార్త వినిపించింది.
Top it company tcs announces good news for students and unemployees

సాక్షి ఎడ్యుకేష‌న్: చ‌దువులు పూర్తి చేసుకొని ఉన్న ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగుల‌కు ఇది ఎంతో పెద్ద శుభ‌వార్త‌.. ముఖ్యంగా  ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు రానున్న రోజుల్లో ఎన్నో మంచి ఉద్యోగావాకాశాలు ఉండ‌నున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక‌త అభివృద్ధిలో అనేక కంపెనీలు వీటిపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుండ‌డంతో అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. కాని, కొన్ని టెక్ కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ లు విడుద‌ల చేయడంపై దృష్టి సారించారు.

ఈ నేప‌థ్యంలోనే మ‌న దేశంలోని ప్ర‌ముఖ ఐటీ సంస్థగా పేరొందిన టీసీఎస్‌.. టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ వ‌చ్చే సంవ‌త్స‌రం అంటే, 2025 నాటికి ప‌ది, ఇర‌వై కాదు ఏకంగా 40 వేల మందికి ఉపాధి అవ‌కాశాన్ని చేకూర్చేందుకు ఏర్పాటు చేస్తున్న‌ట్లు నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. తాజాగా, ఈ పెద్ద సంస్థ చేసిన ప్ర‌క‌ట‌న‌లో వ‌చ్చే సంవ‌త్స‌రం అంటే, 2025లో ఏకంగా 40,000 ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌నున్నార‌ని పేర్కొన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగి 2026 ఆర్థిక సంవత్సరంలో దాన్ని కొనసాగించే ప్రణాళికలలో టీసీఎస్ సంస్థ‌ ఉంది.

5 Tips for Unemployees and Freshers : నిరుద్యోగుల‌కు 5 టిప్స్‌.. ఇవి పాటిస్తే చాలు.. ఉద్యోగం మీదే..!!

అయితే, ప్ర‌స్తుతం ఈ కంపెనీ కృత్రిమ మేధ‌, ఇతర అత్యాధునిక సాంకేతికతల్లో పని చేయడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక దీంతో, ఉద్యోగుల సామార్థ్యాన్ని మ‌రింత పెంచేందుకు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని చూస్తుంది టీసీఎస్ సంస్థ‌.

విద్యార్థుల‌కు శిక్షణ..

విద్యార్థుల‌ ఫైనల్ ఇయర్ సమ‌యంలో, టీసీఎస్ సంస్థ‌ ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది తెలుస్తోంది. ఈ కార్యక్రమంతో వారు తమ చివరి సెమిస్టర్ సమయంలో ప్రత్యక్షంగా సాంకేతిక నిపుణులతో పని చేసే అవ‌కాశం ఉంటుంది. విద్యార్థులకు ఉద్యోగం పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి టీసీఎస్ విద్యా సంస్థలతో కలిసి సరికొత్త శిక్షణ మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విధంగా, విద్యార్థులు తక్కువ సమయంలో నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు.

Mega Job Mela For Freshers: ఈనెల 28న మెగా జాబ్‌మేళా

భవిష్య‌త్తు అవ‌కాశాలు..

టీసీఎస్ అనేది ఒక ఉన్న‌త సంస్థ‌, భార‌త్‌లోనే ప్ర‌ముఖ పేరొందిన కంపెనీ. టాప్ ఐటీ కంపెనీల్లో ఇదీ ఒక‌టి. ఇటువంటి కంపెనీ ప్ర‌స్తుతం, మార్కెట్‌లో మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూలను నిలిపివేసిన టీసీఎస్ ఇప్పుడు మళ్లీ ఆ ప్రక్రియను ప్రారంభించింది. గత సంవత్సరం నుంచి ఉద్యోగ నియామకాలు ఆపివేయడంతో ఈ కొత్త నిర్ణయం విద్యార్థులకు మంచి అవకాశం కావచ్చు. ప్ర‌స్తుతం, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, డిజిటల్ విభాగాలలో టీసీఎస్ మంచి రాబడులను ఆర్జిస్తుంది. ఇప్ప‌టికే, ఉన్న సాంకేతిక‌త‌తో, మార్కెట్‌తో ఉన్న‌తంగా రాణిస్తూ ఆర్జిస్తున్న సంస్థ‌గా పేరు తెచ్చుకుంది టీసీఎస్ సంస్థ‌.

పని విధానం..

ప్రస్తుతం, టీసీఎస్ కంపెనీ 5 రోజుల పనివిధానంపై పర్యవేక్షణ చేస్తోంది. సంస్థ కార్యాలయాలకు వెళ్లినవారికి హాజరు ఆధారంగా ప్రమోషన్లు, ఇన్క్రిమెంట్లు లెక్కిస్తారని కంపెనీ తెలిపింది. ఈ విధానం ఉద్యోగులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు, ఆఫీస్ కల్చర్‌ను పటిష్టం చేయడానికి తీసుకున్న చర్యలలో భాగంగా ఉన్నట్లు టీసీఎస్ పేర్కొంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Dec 2024 05:26PM

Photo Stories