Skip to main content

Indian Railways : 1036 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. చివ‌రి తేదీ ఇదే..!!

నిరుద్యోగుల‌కు వివిధ శాఖ‌ల్లో ఉద్యోగావకాశాలను ప్ర‌క‌టించింది భారతీయ రైల్వేస్.
Indian railways releases job notification

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు వివిధ శాఖ‌ల్లో ఉద్యోగావకాశాలను ప్ర‌క‌టించింది భారతీయ రైల్వేస్. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీగా ఉన్న‌ పోస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.

High Demand Courses : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈ కోర్సుల‌కు భారీ డిమాండ్‌.. ఇవి చేస్తే చాలు..

అర్హత ఆసక్తి  కలిగి ఉన్న అభ్యర్థులు ఈ జాబ్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల‌ను విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ లో చదివి ఆపై అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు  చేసుకోవాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు..

ఖాళీల వివ‌రాలు (1036):

వివిధ సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు - 187, సైంటిఫిక్ సూపర్ వైజర్-3, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు-338, చీఫ్ లా అసిస్టెంట్-54, పబ్లిక్ ప్రాసిక్యూటర్-20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్‌ట్రక్టర్-18, సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్-2, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)-130, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్-3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్-59, లైబ్రేరియన్-10, మ్యూజిక్ టీచర్ (మహిళ)-3, ప్రైమరీ రైల్వే టీచర్ -188,అసిస్టెంట్ టీచర్ (మహిళ)-2, లేబొరేటరీ అసిస్టెంట్/స్కూలు-7, లాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III-12. ఇలా మొత్తం 1036 పోస్టులకు నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది రైల్వే శాఖ‌.

5600 JRO Jobs: గ్రామాల్లో ‘జూనియర్‌ రెవెన్యూ అధికారుల’.. డిగ్రీ చదివిన 5,600 మందికి నేరుగా ఉద్యోగ అవకాశం..

పోస్టుల స్థానం:

సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్,బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గౌహతి, జమ్మూ శ్రీనగర్, కోల్‌కతా, మాల్డా, ముంబై, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ ఆర్‌ఆర్‌బీ పరిధిలో ఉన్నాయి. 

వ‌యోప‌రిమితి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వారికి మరో మూడేళ్లు అదనం.

Bank Job Notification Released: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం.. చివ‌రి తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తులు 7 జనవరి 2025న ప్రారంభం కాగా, 6 ఫిబ్రవరి 2025న ముగుస్తుంది. 

ఇంకెందుకు ఆలస్యం.. ముందుగా నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివండి. ఆపై అప్లయ్ చేయండి. ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం సంపాధించి మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. ఈ సువ‌ర్ణావ‌కాశాన్ని అర్హ‌త క‌లిగిన ప్ర‌తీ నిరుద్యోగి వినియోగించుకోండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Dec 2024 01:34PM

Photo Stories