Skip to main content

Gurukul School : గురుకుల‌ ప్ర‌వేశానికి నిబంధ‌న మార్పులు.. ఆవేద‌న‌లో త‌ల్లిదండ్రులు!!

Fifth class admissions at gurukul school with changes in applications

సాక్షి ఎడ్యుకేష‌న్: గురుకుల పాఠ‌శాల‌ల్లో విద్యార్థులు ప్రవేశం పొందాలంటే ద‌ర‌ఖాస్తులు త‌ప్పనిస‌రి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, తాజాగా గురుకులాల్లో విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం పొంద‌డానికి చేసుకునే ద‌ర‌ఖాస్తుల్లో నిబంధ‌న‌లు మార్పులు చేశారని తెలిసింది. ఈ విష‌యం తెలుసుకున్న‌ విద్యార్థుల త‌ల్లిదండ్రులు అయోమ‌యంలో ఉన్నారు.

Gurukul School Admissions : గురుకులాల్లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త‌లివే!

గతంలో ద‌ర‌ఖాస్తుల స‌మ‌యంలో బోనఫైడ్ సర్టిఫికెట్‌తో పూర్తి అయ్యేదని కుల ఆదాయం ఇప్పట్లో అడిగేవారు కాదు. కాని, ఇప్పుడు ఈ కుల ఆదాయ, సర్టిఫికెట్‌లు తప్పనిసరి చేశారు.

త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌..

కుల, ఆదాయ, సర్టిఫికెట్ నిబంధన తప్పనిసరి కావడంతో పనులను వదులుకొని తహసిల్ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల సర్టిఫికెట్ కోసం నోటరీ తదితర ఫార్మాలిటీ పూర్తి చేయడానికి పనులు వదులుకొని తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు.

Model Schools Admissions 2025 : మోడ‌ల్ స్కూళ్ల‌లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..!

పరీక్ష రాసి సీటు వచ్చిన తర్వాత చేసే పనులు, ప్రతి ఒక్కరు ఇప్పుడే ఇవ్వాలన్న నిబంధనతో దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గుతుందని పలువురు అంటున్నారు. దరఖాస్తు సమయంలో నిబంధనలో సడలింపు ఇవ్వాలని అంటున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Dec 2024 03:15PM

Photo Stories