6th and 9th Class Admissions : ఈ పాఠశాలలో 6, 9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు.. ఎంపిక విధానం ఇదే..!
సాక్షి ఎడ్యుకేషన్: సైనిక్ స్కూల్లో లభించే అద్భుతమైన విద్యా, ఆధునిక సౌకర్యాల కోసం అర్హత ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రవేశించవచ్చు. ఈ పాఠశాలల్లో ప్రవేశం కోసం ఎంతో మంది విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. మంచి నాణ్యతతో కూడిన విద్యతో పాటు దేశ సేవలో భాగస్వామ్యం అవ్వాలనుకునే విద్యార్థులు ఇక్కడ చేరితే వారి ఆశయం, విద్య రెండు నెరవేరతాయి. అయితే, ఈ పాఠశాలలో చేరేందుకు ఎందరో విద్యార్థులు ఎదరుచూస్తుంటారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చేర్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు.
భారత భద్రత కోసం నిరంతరం కృషి చేసే త్రివిధ దళాల్లో అధికారులను విద్యార్థి దశ నుంచే తయారు చేయడం, వారికి ఈ విధుల గురించి అవగాహన కల్పించడం, ఈ బాధ్యలు ఎంత ముఖ్యమో, వాటి ప్రాముఖ్యతను వివరించడం ఎంతో అవసరం. కాగా, ఎలాంటి అనేక విద్యలను సైనిక్ స్కూల్ అందిస్తుంది. ప్రస్తుతం, ఈ స్కూల్‌లో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు.
Admission in 5th class: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష ఇలా..
కొందరు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లేదా నేవీ వంటి విభాగాల్లో ఎదిగారు. కొందరు వాటి ప్రాముఖ్యతను మరి కొందరికి అందించే దిశగా నడుస్తున్నారు. ఈ పాఠశాలలు సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ లతో పాటు ఇతర శిక్షణా అకాడమీలకు కావాల్సిన క్యాడెట్లను.. ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల నుంచే సిద్ధం చేస్తుంటారు.
అయితే, ఈ సైనిక్ స్కూల్లో చేరేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇక్కడ వచ్చే ఏడాది అంటే, 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ 6, 9వ తరగతుల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
Bad News for Students : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. ఈ సెలవుల్లో కుదింపు.. ఇదే కారణం!!
విద్యార్థుల అర్హతలు..
సైనిక్ స్కూల్లో ఆరో తరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.
దరఖాస్తు రుసుం..
జనరల్/రక్షణ రంగంలో పని చేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.800 లుగా నిర్ణయించగా, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.650ల చొప్పున పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేది: జనవరి 14 రాత్రి 11.50 గంటల వరకు ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఎంపిక విధానం..
ఈ పాఠశాలల్లో చేరేందుకు అర్హత కలిగిన విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష లిఖితపూర్వకంగానే ఉంటుంది. అందరూ ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది అనుకుంటారు కాని, ఇది ఓఎమ్ఆర్ షీట్, పెన్ తో మాత్రమే ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష కేంద్రాలు..
సైనిక్ స్కూల్లో చేరేందుకు రాయాల్సిన పరీక్షను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 190 పట్టణాలు /నగరాల్లో నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను ప్రస్తుతానికి ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు.
పరీక్ష సమయం..
ఆరో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు) 150 నిమిషాలు.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు) 180 నిమిషాలు.
మార్కులు ఇలా..
ఆరో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు:- లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 150 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
Sainik School Admissions: సైనిక్ స్కూల్‌లల్లో అడ్మిషన్లు.. ముఖ్యమైన వివరాలు ఇవే..
తొమ్మిదో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు :- మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; ఇంగ్లీష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఏపీలో పరీక్ష కేంద్రాలు..
అనంతపురం, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
Sainik School Admissions : సైనిక్ పాఠశాలల్లో ప్రవేశానికి మంచి చాన్స్ ఇదే.. ముఖ్యమైన వివరాలు!!
తెలంగాణ పరీక్ష కేంద్రాలు..
తెలంగాణ విద్యార్థులు సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం హైదరాబాద్, కరీంనగర్.
ఇలా, విద్యార్థులు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు హాజరై వారు పరీక్షను రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తులు..
విద్యార్థులు 2025 జనవరి 13న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఈ https://exams.nta.ac.in/AISSEE/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, విద్యార్థులు వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
Tags
- sainik schools admission
- Admissions 2025
- schools admissions 2025
- ap and telangana schools
- online applications
- exams for schools admissions
- sainik schools admissions 2025
- entrance exam for sainik school admissions
- january 13th
- ap and telangana sainik schools admissions
- Navy Jobs
- Indian army
- air force jobs for sainik school students
- sainik school history
- ap and ts sainik schools
- admissions for sainik schools 2025
- news academic year 2025
- entrance exam for sainik school admission
- exam centers for sainik school admissions
- School admissions 2025
- AISSEE 2025
- AISSEE Notification 2025
- All India Sainik School Entrance Exams
- AISSEE admit card for 2025 admissions
- students education and future
- sainik school students education and future
- Education News
- Sakshi Education News
- CentralGovernmentSchool
- SainikSchoolEntrance
- AdmissionNotification
- SainikSchool2025