Skip to main content

Bad News for Students : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్‌.. ఈ సెల‌వుల్లో కుదింపు.. ఇదే కార‌ణం!!

ఏపీ విద్యార్థులు రానున్న సెల‌వుల విష‌యంలో చేదు క‌బురు వినే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నాయి.
Bad news for students on declining sankranti holidays   Sankranti holiday schedule 2025 calendar Education Department proposed holiday adjustments

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీ విద్యార్థులు రానున్న సెల‌వుల విష‌యంలో చేదు క‌బురు వినే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నాయి. ఏపీలో కొంత‌కాలంగా భారీ వ‌ర్షాలు, తుఫాన్లు, బంద్‌లు వంటి విష‌యాల కార‌ణంగా జాగ్ర‌త్తుల వ‌హించేందుకు తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వుల‌పైన సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. వారంలో క‌నీసం 3 మూడు రోజులు పాటు సెల‌వులు ఉండేవి. ఇలా వివిధ కార‌ణాల‌తో అనేక సార్లు విద్యార్థుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. విష‌యానికొస్తే..

Gurukul School Admission New Rules : గురుకుల పాఠశాల అడ్మిషన్లలకు కొత్త నిబంధనలు అమలు

ప‌ది రోజుల సెలవులు!

గ‌తంలో అనేక సెల‌వులొచ్చాయి. అయితే, వ‌చ్చే సంవ‌త్స‌రం అంటే, జ‌న‌వ‌రి 2025లో వ‌చ్చే సంక్రాంతి పండుగ ఏపీలో ఎంతో కీల‌కం. అక్క‌డి ఇది పెద్ద పండుగ‌. వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో స్థిర‌ప‌డ్డ‌వారంతా సెల‌వుల్లో ఈ పండ‌క్కి త‌మ స్వ‌గ్రామానికి వ‌స్తారు. కాగా, ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌క‌టించిన క్యాలెండ‌ర్ ప్ర‌కారం, ఈసారి సంక్రాంతికి ఒక‌టి రెండు కాదు, ప‌ది (10) రోజులు సెల‌వులు ఉంటాయి పేర్కొన్నారు. కాని, ప్ర‌స్తుతం విద్యాసంస్థ‌ల్లో ఉన్న ప‌రిస్థితిని చేస్తే ఈ సెల‌వులు ఎక్కువ అవుతాయ‌ని భావిస్తున్నారు అధికారులు.

Sainik School Admissions: సైనిక్ స్కూల్‌ల‌ల్లో అడ్మిషన్లు.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే..

విద్యాశాఖ ప్ర‌తిపాద‌న‌

ఇప్ప‌టికే ఇచ్చిన సెల‌వుల కార‌ణంగా అనేక విద్యాసంస్థ‌ల్లో ఈ స‌మయం వ‌ర‌కు పూర్తి కావాల్సిన సిల‌బస్ ఇంక పూర్తి కాలేదు. కార‌ణం.. సెల‌వులే అని చెబుతున్నారు అధికారులు. అయితే, విద్యార్థులకు గ‌తంలో వివిధ కార‌ణాల వ‌ల్ల అనేక రోజులు సెల‌వులు ప్ర‌క‌టించ‌గా, వారికి ఆ సెల‌వుల్లో పూర్తి చేయాల్సిన పాఠాలు ఇంకా మిగిలిపోయాయి.

Pariksha Pe Charcha : 'ప‌రీక్ష పే చ‌ర్చ' కార్యక్ర‌మం.. ప‌రీక్ష‌ల‌కు ప్రోత్సాహ‌కం.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

దీంతో, ఈసారి సంక్రాంతి సెల‌వుల‌ను మ‌రింత కుదింపు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఈ ఏడాది విద్యాశాఖ ప్ర‌క‌టించిన‌ క్యావ‌లెండ‌ర్ ప్ర‌కారం, 2025 జ‌న‌వ‌రి 10 నుంచి 19వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఉంటాయి. ఆప్షనల్ హాలిడేస్ దృష్ట్యా.. ఆ సెలవులను సంక్రాంతి సెలవుల్లో సర్దుబాటు చేయాలన్నది విద్యాశాఖ ప్రతిపాదన. 

ప‌ది రోజులు కాస్త‌..

సెల‌వుల త‌గ్గింపులో ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌ది రోజుల సెల‌వుల‌ను కాస్త‌, 5 రోజుల‌కు మార్చే అవ‌కాశం ఉంది. అంటే, జనవరి 11 నుంచి 16 వరకు మాత్రమే ఈసారి ఏపీ విద్యార్థుల‌కు సంక్రాంతి సెల‌వులు అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే, ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇప్ప‌టికే సెలవులకు సంబంధించి ప్రణాళికలు వేసుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో సెలవులకు అంటే ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే దీనిపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Dec 2024 03:18PM

Photo Stories