Skip to main content

SSC Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

10th class public exam fee
10th class public exam fee

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీ(AP) SSC బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల మార్చి-2025 పరీక్ష ఫీజు(Exam Fee) చెల్లించని వారికి మరో అవకాశం కల్పించింది.

Free computer training: ఉచిత కంప్యూటర్ శిక్షణ: Click Here

తత్కాల్(Tatkal) విధానం కింద ఫీజు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి(KV Srinivasulu Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించనివారు తత్కాల్ కింద రూ. 1000 ఫైన్(Fine)తో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు పే చేయవచ్చని పేర్కొన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్(HM), ప్రిన్సిపాళ్లు(Principals) విద్యార్థులు ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని సూచించారు.

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

మార్చి 17 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 – ఇంగ్లీష్
మార్చి 24 – మ్యాథ్స్
మార్చి 26 – ఫిజిక్స్
మార్చి 28 – బయోలజీ
మార్చి 31 – సోషల్ స్టడీస్

 

Published date : 26 Dec 2024 08:39PM

Photo Stories