Skip to main content

January Schools and Colleges Holidays 2025 : జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు సెల‌వులు ఇంతేనా..? కానీ వీళ్ల‌కు మాత్రం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న‌ కొత్త ఏడాదిలో మొద‌టి నెల జ‌న‌వ‌రిలో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి.
january schools and colleges holidays 2025

క్రిస్మస్ సెలవులు ముగియగానే.. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా సెలవులే సెలవులు. 

2025 జ‌న‌వ‌రి నెల‌లో సెల‌వులు ఇవే...
జనవరి 2025లో.. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే అందులో తొమ్మిదిరోజులు సెలవులే. అంటే స్కూళ్లు, కాలేజీలు నడిచేది కేవలం 22 రోజులు మాత్రమే. ఇది విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. వచ్చేనెలలో ఏ రోజు సెలవు వుంది? ఎందుకోసమో తెలుసుకుందాం. జనవరి 1, 2025 (బుధవారం) నూతన సంవత్సరాది సందర్భంగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాబట్టి ఆరోజు విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజుకు బదులు జనవరి 11 రెండో శనివారం సెలవులు రద్దుచేసారు. ఆ రోజు విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి. 

పండ‌గే పండ‌గ‌...
స‌రిగ్గా ఇదే నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా.. ఈ నెల మధ్యలో సంక్రాంతి పండగ సందర్భంగా సెలవులు రానున్నాయి. ఈ సెలవులకు ఆదివారం కలిసిరావడంతో లాంగ్ వీకెండ్ వస్తోంది. జనవరి 13 సోమవారం భోగి, జనవరి 14 మంగళవారం సంక్రాంతి సెలవు. ఆ తర్వాతి రోజు జనవరి 15 కనుమకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అదే రోజు హజ్రత్ అలీ బర్త్ డే సందర్భంగా కూడా విద్యార్థులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఇలా జనవరి 12 నుంచి 15 వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చాయి.

సంక్రాంతి త‌ర్వాత మ‌రో రోజు సెల‌వు ఇలా..
సంక్రాంతి సెలవుల తర్వాత ఇదే జనవరిలో మరో సెలవు వస్తుంది. షబ్-ఈ-మేరాజ్ సందర్భంగా తెలంగాణ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అంటే ఆ రోజు కూడా కావాలనుకుంటే విద్యార్థులు సెలవు తీసుకోవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జాతీయ సెలవు. అయితే ఆరోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవుతో కలిసిపోయింది.

మంది 9 రోజులు పాటు...
సాధారణంగా ప్రతి ఆదివారం విద్యాసంస్థలకు సెలవు వుంటుంది. ఇలా జనవరిలో కూడా 5,12,19,26 తేదీల్లో సాధారణ సెలవు వుంది. ఈ నాలుగు రోజులు విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం వుండదు. వీటికి న్యూ ఇయర్, సంక్రాంతి పండగ, షబ్‌-ఈ‌-మేరాజ్ సెలవులను కలిపితే మొత్తం తొమ్మిది రోజులు సెలవులు వస్తున్నాయి. అలాగే ప్ర‌భుత్వ‌,  ప్రైవేట్ ఆఫీసులు కూడా... దాదాపు 6 నుంచి 8 రోజులు సెల‌వులు రానున్నాయి వ‌చ్చే జ‌న‌వ‌రి నెల‌లో.

ఈ సెల‌వులు విష‌యంలో నిరాశ‌...?
అయితే జనవరి 15న కనుమ, హజ్రత్ అలీ బర్త్ డే ఒకేరోజు వస్తున్నాయి. ఇక జనవరి 26 రిపబ్లిక్ డే కూడా సెలవురోజైన ఆదివారం వస్తోంది. ఇక రెండో శనివారం హాలిడేనే పనిదినంగా ప్రకటించడంతో మరో రోజు సెలవు మిస్సయ్యింది. ఇలా తెలంగాణ విద్యార్థులకు జనవరి 2025లో మరో మూడురోజుల హాలిడేస్ మిస్సయ్యాయి.

ఈ 2024 ఏడాది స్కూల్, కాలేజీ విద్యార్థులకు మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో సాధారణ సెలవులతో పాలు ప్రకృతి వైపరిత్యాల కారణంగా కూడా భారీగా సెలవులు వచ్చాయి. భారీ వర్షాలు, వరదలతో పాటు... వివిధ ర‌కాల బంద్‌ల‌తో.. స్కూళ్లు, కాలేజీలకు భారీగానే సెల‌వులు వచ్చాయి. 

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే :
జ‌న‌వ‌రి 2025 :
➤☛ నూతన సంవత్సరం – 01
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25

Published date : 26 Dec 2024 03:43PM

Photo Stories