Skip to main content

Tomorrow School and Colleges Holidays : రేపు స్కూల్స్‌, కాలేజీలు సెల‌వు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్, కాలేజీల‌కు విద్యార్థులు గుడ్‌న్యూస్‌. రేపు అన‌గా న‌వంబ‌ర్ 18 (సోమ‌వారం) స్కూల్స్‌, కాలేజీల‌కు ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది.
Tomorrow School and Colleges Holiday

న‌వంబ‌ర్ 18వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 పేప‌ర్ 3 ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు ప్ర‌భుత్వం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్‌–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దాదాపు 80 శాతం మందికి పైగా గ్రూప్‌-3 అభ్య‌ర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణ‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

➤☛ TSPSC Group 3 Question Paper-1 With Key 2024 : గ్రూప్‌–3 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ'.. ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇవే...!

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు...

Published date : 18 Nov 2024 08:19AM

Photo Stories