Skip to main content

World Boxing Day : ప్ర‌పంచ బాక్సింగ్ డే ఎందుకు జ‌రుపుతారు.. ఈ రోజు ప్ర‌త్యేక‌తులు ఇవే..!!

ప్ర‌తీ ఏటా డిసెంబర్ 25వ తేదీన జ‌రిపిన క్రిస్మ‌స్ త‌రువాత రోజు అంటే డిసెంబ‌ర్ 26వ తేదీన బాక్సింగ్ డే ని జ‌రుపుతారు.
World boxing day celebrations and its specialities

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌పంచ వ్య‌ప్తంగా డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే ను జ‌రుపుకుంటారు. కాని, చాలామందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఈ బాక్సింగ్ డే అనేది అస‌లు క్రీడ‌ల‌కు సంబంధించిన రోజు కాదు. క్రిస్మస్‌ మరుసటిరోజు కొన్ని దేశాల్లో అప్ప‌ట్లో ఈ వేడుక జరుపుకునేవారు.

Telangana TET 2024 Hall Ticket Download: నేడు టెట్ హాల్‌టికెట్లు విడుదల ....డౌన్‌లోడ్ విధానం ఇలా..

ఇప్పుడు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు. యూకే, స్కాట్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రీయా,న్యూజీలాండ్, కెనడా వంటి దేశాల్లో బాక్సిండే రోజు పబ్లిక్‌ హాలిడేగా ప్రకటిస్తారు అక్క‌డి ప్ర‌భుత్వం. ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది. కాగా, మ‌న భార‌త దేశంలో కూడా ఈ రోజు సెల‌వుగా ప్ర‌క‌టిస్తారు. దీనిని క్రిస్మస్ మ‌రుస‌టి రోజు జ‌రుపుకోవ‌డానికి కార‌ణం ఉంది..

ఈ బాక్సింగ్ డే ను ప్ర‌తీ ఏటా డిసెంబ‌ర్ 26వ తేదీ భార‌త దేశంలోనే కాదు.. ఇత‌ర దేశాల్లో కూడా ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. దీనిని చారిత్ర‌క ప‌ద్ధ‌తుల్లో, ఆధునిక వేడుక‌లుగా జ‌రుపుకుంటారు. 'బాక్సింగ్‌ డే' 1871 నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీని గుర్తించి, ఆ రోజును ప్ర‌పంచ బాక్సింగ్ డే గా జ‌రుపుకుంటారు. ఈ రోజును UK, US, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు. ఇక్కడ కుటుంబాలు క్రిస్మస్ అనంతర ఉత్సవాల్లో ఆనందాన్ని కొనసాగిస్తాయి.

Sainik School Admissions: సైనిక్ స్కూల్‌ల‌ల్లో అడ్మిషన్లు.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే..

బాక్సింగ్ డే గా ఎలా అంటే..

ఈ ప్ర‌పంచ బాక్సింగ్ అనేది ఎటువంటి క్రీడ‌ల‌కు సంబంధించింది కాద‌ని కొంద‌రికి తెలిసినప్ప‌టికీ, దీనిని క్రిస్మ‌స్ మ‌రుస‌టి రోజు ఎందుకు జ‌రుపుకుంటారో స్ప‌ష్టంగా తెలీయ‌న‌ప్ప‌టికీ, విస్తృతంగా ఆమోదించిన‌ సిద్ధాంతం ప్రకారం, ఇంగ్లాండ్‌లోని విక్టోరియన్ శకంలో, సంపన్న కుటుంబాలు బహుమతులు, డబ్బు లేదా ఆహారాం వంటి వాటిపి  సద్భావన సంకేతాలుగా పంపిణీ చేసేవారు. "బాక్సింగ్ డే" అనే పదం సేవకులు, కార్మికులు, తక్కువ అదృష్టవంతులకు "క్రిస్మస్ పెట్టెలు" ఇచ్చే ఈ సంప్రదాయం నుండి ఉద్భవించింది. ఇక అప్ప‌టి నుంచి దీనిని ప్ర‌పంచ బాక్సింగ్ డే గా జ‌రుపుకుంటారు.

ప్ర‌తీ ఏటా, క్రిస్మస్ కాలంలో పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ చట్టం ఉద్దేశించారు. వాళ్ళ‌కు కూడా పండుగ సీజన్‌ను ఆస్వాదించి, సంతోషంగా పండుగ‌లో భాగం కావొచ్చ‌ని భరోసా ఇచ్చారు. ఆచారం చర్చిలకు కూడా విస్తరించింది, అక్కడ భిక్ష పెట్టెలు తెరిచి పేదలకు పంపిణీ చేస్తారు.

Medical Jobs: చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వోలో మెడికల్, పారా మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.32,670 జీతం

ఈ ప్ర‌పంచ బాక్సింగ్‌కు సంబంధించిన మరో సిద్ధాంతం ఏంటంటే.. బ్రిటన్ దేశం గర్వించదగిన నావికా సంప్రదాయం నుండి వచ్చిందని ఇంకా అది సుదీర్ఘ ప్రయాణాల కోసం డబ్బు మూసివున్న పెట్టెలో ఉంచబడే రోజుల నుండి వచ్చింది. సముద్రయానం విజయవంతమైతే ఆ పెట్టెను పేదలకు పంచడానికి పూజారికి ఇవ్వబడుతుంది.

ప్రారంభం.. ప్ర‌త్యేక‌త‌..

'బాక్సింగ్‌ డే అనే ఒక రోజు 1833 నుంచి నిర్వహించడం మొదలైంది. అయితే, ఎవరు ప్రారంభించారనేది అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా కూడా ప్ర‌తీ ఏటా ప్ర‌పంచం ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటుంది. ఈ రోజుని బహుమతుల హాలిడే అని పిలుస్తారు. ఈ రోజున ఉద్యోగులు తమ సూపీరియర్స్‌ నుంచి బహుమతులు పొందుతారు. ఇంటి పనివారికి కూడా గిఫ్ట్‌లు ఇస్తారు. బాక్సింగ్ డే రోజు వారి కుటుంబాల వద్దకు వెళ్లి ఈ గిఫ్టులను వారికి కూడా అందిస్తారు.

JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700

స్పోర్ట్స్ కూడా..

ఇలా, కేవ‌లం ఒక క్రిస్మ‌స్ వేడుక‌ల్లో భాగ‌మే కాకుండా, క్రీడలను తిలకించే రోజుగా కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రీయా దేశాల్లో క్రికెట్‌ చూస్తారు అంతేకాదు ఐస్‌ హాకీ, హార్స్‌ రేసులు కూడా నిర్వహిస్తారు. డిసెంబర్‌ 26న రెడ్‌ బాల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ కూడా ఆడతారు. ఆస్ట్రీయా ఐకానిక్‌ స్టేడియం మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Dec 2024 11:32AM

Photo Stories