Skip to main content

Gurukul Admissions Notification : గురుకులాల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే..!

విద్యార్థులు గురుకులాల్లో ప్ర‌వేశం పొందేందుకు అధికారులు నోటిఫికేష‌న్ ను ఈ నెల అంటే, డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేశారు.
Telengan residential schools admission process TTWREIS Entrence exam notification  Gurukul schools admission notification released  Gurukulam schools in telengana

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు తెలంగాణ‌లోని గురుకులాల్లో ప్ర‌వేశం పొందేందుకు అధికారులు నోటిఫికేష‌న్ ను ఈ నెల అంటే, డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేశారు. అయితే, అర్హ‌త క‌లిగిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు.

ఈ తేదీల్లోనే..

డిసెంబ‌ర్ 20వ తేదీన విడుద‌లైన ఈ నోటిఫికేష‌న్ కు ఫిబ్ర‌వ‌రీ, 5 2025 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. అయితే, ద‌ర‌ఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్ర‌వ‌రీ 23వ తేదీన ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు వివ‌రించారు. కాగా, ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్‌ల‌ను ఫిబ్ర‌వరీ 14 నుంచి 23వ తేదీ వ‌ర‌కు వెబ్‌సైట్‌లో అంద‌బాటులో ఉంటుంద‌న్నారు.

Gurukul School : గురుకుల‌ ప్ర‌వేశానికి నిబంధ‌న మార్పులు.. ఆవేద‌న‌లో త‌ల్లిదండ్రులు!!

ఈ తేదీల్లోనే ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు.  ఫిబ్రవరి నెల 23వ తేదీ నుండి ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్షలు ఉంటాయి.

ల‌క్ష 80వేల మంది..

టీజీఎస్​డబ్ల్యూఆర్​ఈఐఎస్ ​సంస్థ నిర్వహించే కామన్​ ఎంట్రన్స్​టెస్ట్ ​కోసం ఏటా లక్ష 80 వేల మంది వరకు దరఖాస్తు చేసుకుంటుండగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 పరీక్ష కేందాలలో పరీక్షలు రాస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ ఇన్‌కం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్​సర్టిఫికెట్, లేదా పాస్​పోర్టు, ఆధార్​నెంబర్‌లను మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Dec 2024 11:12AM

Photo Stories