Skip to main content

5 Tips for Unemployees and Freshers : నిరుద్యోగుల‌కు 5 టిప్స్‌.. ఇవి పాటిస్తే చాలు.. ఉద్యోగం మీదే..!!

విద్యార్థులు, నిరుద్యోగులు ఈ పోటీ ప్ర‌పంచంలో నిల‌బ‌డి ఉన్న‌తంగా రాణించేలా.. ఉన్న‌త విద్య‌, ఉద్యోగం, స్కిల్స్ పొందేలా కెరీర్ గైడెన్స్ మాదిరిగా వివిధ రంగాల్లోని నిపుణులు సూచించారు..
Top five tips and required skills for unemployees and students   Career guidance tips for freshers  Tips for freshers to succeed in their careers  Expert tips for freshers to excel in their careers

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు డిగ్రీ, బీటెక్ వంటి కోర్సుల్లో చివరి సంవ‌త్స‌రంలో ఉన్న‌ప్పుడు మ‌రింత టెన్ష‌న్ ప్రారంభం అవుతుంది.  కొంద‌రు వారి చ‌దువుకు త‌గ్గిన ఉద్యోగాలు చూసుకొని స్థిర‌ప‌డ‌తారు. మ‌రి కొంద‌రు వారి క‌ల‌ల‌పై న‌డుస్తారు. కాని చాలామంది, చ‌దువు పూర్తి అయిన వెంట‌నే ఏం చేయాలి.? ఉద్యోగం చేయాలా..! పై చ‌దువులు చ‌ద‌వాలా..! అస‌లు ప్ర‌స్తుతం, చ‌దువుతున్న కోర్సులో ఉన్న‌త మార్కులు వ‌స్తాయా..! అనుకున్న‌క‌ల వైపు న‌డ‌వాలా..! అని అనేక ప్ర‌శ్న‌లు వారి మ‌ది మెదులుతాయి.

Mega Job Mela For Freshers: ఈనెల 28న మెగా జాబ్‌మేళా

పోటీ ప్రపంచం

ఇదిలా ఉంటే మ‌రోవైపు అనేక మంది విద్యార్థులు విద్య‌సంస్థ‌ల్లోంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్పుడు, ఉద్యోగం సాధిస్తాం అని అనుకుంటారు కాని, బ‌య‌ట ప్ర‌పంచంలో జ‌రిగేదే వేరు. ఈ ఉద్యోగ ప్ర‌పంచంలో అనేక పోటీలు ఉంటాయి. ఎంత టాలెంట్ ఉన్న‌, ఎన్ని స్కిల్స్ ఉన్న‌, ఎన్ని డిగ్రీలు పొందినా, చాలామంది ఇప్ప‌టికీ ఉద్యోగాల‌ను వెతుకుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం, ప్ర‌తీ రంగంలో అనేక పోటీ, మార్కెట్ ప‌డిపోవడం వంటివి జ‌రుగుతున్నాయి. పైగా, ప్రస్తుతం అన్ని రంగాల్లో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ దారుణంగా తగ్గిపోయింది కూడా. దీంతో ఎంతో కాలం అనుభ‌వం ఉన్న ఉద్యోగుల‌కే ఎంత ప్ర‌య‌త్నించినా ఉద్యోగుల దొర‌క‌డం లేదు.

Contract and outsourcing jobs: 10వ తరగతి అర్హతతో కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం నెలకు 61000

బ‌య‌ట ప‌రిస్థితి తెలుసుకొని చాలామంది ఇష్టం లేక‌పోయినా, వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌రి ఫ్రెష‌ర్స్ మ‌రింత దారుణంగా ఉంది. వారికి ఎటువంటి అనుభవం లేక ఎలాంటి కంపెనీల్లో కూడా ఉద్యోగం దొర‌క‌డం లేదు. ఇటువంటి అనేక విష‌యాలే నేడు విద్యార్థులు, అనుభ‌వం లేని ఫ్రెష‌ర్స్‌లో భ‌యం పుట్టిస్తోంది. ఎలాంటి దారిలో న‌డిస్తే ఉద్యోగాలు వ‌స్తాయి..? ఇంకేం చ‌దివితే, ఏ ప‌ని చేస్తే, ఏ కోర్సులు పూర్తి చేసుకుంటే, ప‌ని అనుభ‌వాన్ని కాస్త అయినా పొంద‌వ‌చ్చు అని చాలామంది విద్యార్థుల్లో ఉన్న ప్ర‌శ్న‌లు..

ఈ క్రమంలో జాబ్ కొట్టాలన్నా, కెరీర్‌లో సక్సెస్ అవ్వాలన్నా ఫ్రెషర్స్ 5 టిప్స్‌ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవే..

1. ట్రైనింగ్ తప్పనిసరి: అకడమిక్ వేరు.. రియల్ టైమ్ పరిస్థితులు వేరు. కాబట్టి, జాబ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు సంబంధిత రంగంలో ఎంతో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్, చిన్న చిన్న అనుభ‌వాలు ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ నాలెడ్జ్‌ పెంచడంతో పాటు రియల్ వరల్డ్ ఇండస్ట్రీలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందనే అనుభవం వస్తుంది. భవిష్యత్తులో జాబ్‌లో చేరిన త‌రువాత ఈ అనుభ‌వం ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటితో పాటు ప్రస్తుతం కంపెనీల్లో వాలంటీరింగ్ అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఇవి కూడా పనికొస్తాయి. జాబ్ ఇంటర్వ్యూలో మీ సీవీలను ఈ ట్రైనింగ్ మరింత బలోపేతం చేస్తుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

2. ప్రొఫెషనల్స్‌తో అసోసియేషన్: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో నెట్‌వర్కింగ్ చాలా ఇంపార్టెంట్‌గా మారింది. ఏ ఇండస్ట్రీలో ఉన్నా అందులోని ప్రొఫెషనల్స్‌తో అసోసియేట్ కావడం, ఇండస్ట్రీ ట్రెండ్స్‌ ఫాలో అవ్వడం తప్పనిసరి. జాబ్ ఫెయిర్స్, వెబినార్స్, తదితర ఇండస్ట్రీ ఈవెంట్లలో పాల్గొంటే ప్రొఫెషనల్ నెట్‌వర్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి మీ పర్‌స్పెక్టివ్‌ను పెంచడంతో పాటు నిపుణుల నుంచి కీలక సలహాలు, సూచనలు పొందవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్స్, సోషల్ కమ్యూనిటీల ద్వారా కూడా ప్రొఫెషనల్స్‌తో అసోసియేట్ కావొచ్చు.

3. స్కిల్ డెవలప్‌మెంట్: టెక్నాలజీ అడ్వాన్స్ అవుతోంది. మరోవైపు, కాంపిటిషన్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టడం చాలా కీలకం. కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు వస్తున్న అడ్వాన్స్‌డ్ టూల్స్‌పైనే ఫోకస్ చేస్తున్నాయి. వీటిలో స్కిల్ ఉన్నవారికే కంపెనీలు ప్రయారిటీ ఇస్తున్నాయి. కాబట్టి, డిమాండ్ ఉన్న స్కిల్స్‌ నేర్చుకోవడం స్టూడెంట్స్‌కి తప్పనిసరిగా మారుతోంది. ఆన్‌లైన్ కోర్సులు, షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులతో స్కిల్స్ పెంచుకోవచ్చు.

Medical Jobs: చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వోలో మెడికల్, పారా మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.32,670 జీతం

4. ఆన్‌లైన్ రిసెర్చ్‌: ప్ర‌స్తుత కాలంలో అన్ని ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. కాగా, ఎటువంటి జాబ్స్ ఉన్న కూడా ప్ర‌తీ కంపెనీలు వారి వెబ్‌సైట్‌ల‌లో లేదా ఆన్‌లైన్‌ల‌లో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్, జాబ్ పోర్టల్స్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు యాక్టివ్‌గా ఉండటంతో పాటు మీ స్కిల్‌సెట్, టాలెంట్‌ను మొత్తం అందులో చూపిస్తూ ఉండాలి. ఆన్‌లైన్‌లో ఇండస్ట్రీ నిపుణులతో చర్చలు జరపడం, ఇతర పనులు షేర్ చేసుకోవడం వంటివి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో హెల్ప్ అవుతాయి. ఇలాంటి వారితో మాట్లాడితే మీ బలాలు, బలహీనతలపై స్పష్టత వచ్చి మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

5. సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యం: టెక్నికల్ స్కిల్స్‌తో పాటు స్టూడెంట్స్‌కి సాఫ్ట్ స్కిల్స్ కూడా ముఖ్యమే. క్యాంపస్ ఇంట‌ర్వ్యూలో ఎటువంటి కంపెనీలు అయినా, ఇలాంటి స్టూడెంట్స్‌కి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ని పెంచుకుంటే ఇంటర్వ్యూ షార్ట్‌లిస్టులో మీ పేరే ముందు వరుసలో ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, టీమ్‌తో కలివిడి తత్వం వంటివి ప్రాజెక్టుల్లో పనిచేసేటప్పుడు చక్కగా పనికొస్తాయి. కాగా, మ‌నలో ప్ర‌తీ టాలెంట్‌ను మెరుగు మ‌రుచుకోవ‌డం ముఖ్య‌మే. స‌మ‌యంలోపాటు మారుతూ ప్ర‌తీ స్కిల్స్‌ని నేర్చుకుంటే రేపు మీకే ఉప‌యోగ‌ప‌డుతుంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Dec 2024 12:22PM

Photo Stories