Skip to main content

Contract and outsourcing jobs: 10వ తరగతి అర్హతతో కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం నెలకు 61000

contract outsourcing jobs
contract outsourcing jobs

ఏపీలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ కాలేజీలల్లో ఇక నుంచి మధ్యాహ్న భోజనం: Click Here

సంస్థ పేరు: ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని YSR జిల్లా , DMHO నుండి విడుదల చేయడం జరిగింది.

పోస్టుల పేర్లు: ఫిజిసియన్ / మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , FNO, సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ , ఫార్మసిస్ట్, TB హెల్త్ విజిటర్ 

ఖాళీలు:
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఫిజిసియన్ / మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు – 03
FNO – 05 పోస్టులు
సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ – 04 పోస్టులు
ఫార్మసిస్ట్ – 01 పోస్టు 
TB హెల్త్ విజిటర్ – 01 పోస్టు 

జీతం: 
ఫిజిసియన్ – 1,10,000/- , మెడికల్ ఆఫీసర్ – 61,000/-
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు – 32,670/-
FNO – 15,000/-
సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ – 15,000/-
ఫార్మసిస్ట్ – 23,393/-
TB హెల్త్ విజిటర్ – 25,526/-

పోస్టింగ్: ఎంపికైన వారు వారు YSR కడప జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ తేదీలు: 
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 21-12-2024 నుండి అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 30-12-2024

విద్యార్హత: 10వ తరగతి, డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి అర్హతలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : 
జనరల్ అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, PWD అభ్యర్థులు  అభ్యర్థులు 200/- ఫీజు చెల్లించాలి. 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 1 మార్కు కేటాయిస్తారు.
మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు. 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: 
అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని మరియు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.

అప్లికేషన్ అందించాల్సిన అడ్రస్: DMHO, YSR కడప జిల్లా 

Download Notification PDF – Click Here

Published date : 25 Dec 2024 08:02PM

Photo Stories