Skip to main content

Credit Card scheme: కేంద్ర ప్రభుత్వం Credit Card scheme రూ. 3 లక్షల లోన్

Kisan Credit Card Scheme
Kisan Credit Card Scheme

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల కోసం సామాజిక, ఆర్థిక భద్రతా పథకాలు అందిస్తోంది. అందులో ఒకటే కిసాన్ క్రెడిట్ క్రార్డ్ స్కీమ్. ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ చూపకుండానే రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు: Click Here

వడ్డీ కేవలం 4 శాతమే. అయితే, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకు మాత్రమే ఇస్తారు. వ్యవసాయంలోని వివిధ దశల్లో రైతుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. బ్యాంకుల ద్వారా రైతులకు హామీ రహిత రుణాలు అందించేందుకు దీనిని తీసుకొచ్చారు. సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన సమయానికి రైతులకు నగదు సాయం అందించేందుకు ఈ పథకాన్ని తీర్చిదిద్దారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రాసెస్, ఛార్జీలు..

పార్లమెంట్ వేదికగా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకంలో చేరాల్సిన రైతులకు కావాల్సిన డాక్యుమెంట్లు, వడ్డీ రేట్లు, ఛార్జీల వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ప్రాసెసింగ్, డాక్యుమెంటే,న్, విచారణ సహా ఇతర ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. చిన్న, సన్నకారు రైతులపై అదనపు భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రూ.3 లక్షలకుపైగా లోన్ తీసుకుంటే పైన చెప్పిన ఛార్జీలన్నీ చెల్లించాల్సి ఉంటుంది.

కేసీసీ స్కీమ్ ద్వారా రూ.3 లక్షల వరకు లోన్:

అలాగే ఈ రుణాలపై వడ్డీ రేట్ల విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. ‘ కేసీసీ స్కీమ్ ద్వారా రూ.3 లక్షల వరకు రుణాలపై వార్షిక వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. అయితే, సరైన సమయానికి లోన్ తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీంతో ఏడాదికి వడ్డీ రేటు 4 శాతమే అవుతుంది. రూ.3 లక్షలకుపైగా ఉండే రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకు బోర్డు పాలసీల ప్రకారం ఉంటాయి.’ అని కేంద్ర మంత్రి వివరాలు వెల్లడించారు.

ఆన్‌లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి?

మీరు కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకునే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి.

అక్కడ కనిపించే ఆప్షన్లలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో అడిగిన వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి.

సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ రిఫెరెన్స్ నంబర్ వస్తుంది.

మీకు అర్హత ఉన్నట్లయితే బ్యాంకు 3-4 పనిదినాల్లో మిమ్మల్ని సంప్రదిస్తుంది.

Published date : 24 Dec 2024 09:21PM

Photo Stories