Skip to main content

Four Courses at Skill University : యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. స్కిల్ యూనివ‌ర్సిటీలో మ‌రో నాలుగు కోర్సులు.. ఇలా ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించినగా ప్ర‌వేశాలు కూడా ప్రారంభం అయి, త‌ర‌గ‌తులూ సాగుతున్నాయి.
Four extra courses at young india skill university

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించినగా. గత ఏడాది దసరా నుంచి అడ్మిషన్లు కూడా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఉన్న కోర్సుల‌తో పాటు మ‌రో నాలుగు కోర్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

90 Vacancies Job Mela : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

అవే.. ఎండోస్కోపీ టెక్నిషియన్, సప్లయ్ చైన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం, మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ కోర్సులు. ఇప్ప‌టికే, ఈ కోర్సుల్లో త‌ర‌గ‌తులు కూడా ప్రారంభం అయ్యాయి. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ వెబ్‌సైట్ https://yisu.inలో రిజిస్ట్రార్ అయ్యి, ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ చేయాలి.

దరఖాస్తు విధానం

1.విద్యార్థులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో వివిధ‌ కోర్సులలో ప్ర‌వేశం పొందేందుకు.. https://yisu.in/apply-now/ వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ మీకు కావాల్సిన కోర్సుల‌పై క్లిక్ చేయాలి.

2. త‌ర్వాత‌, మీ పేరు, తండ్రి పేరు, ఫోన్ నెంబర్, త‌దిత‌ర వివరాలను న‌మోదు చేయాల్సి ఉంటుంది. అక్క‌డ అడిగే ప్ర‌తీ వివరాల‌ను న‌మోదు చేయాలి.

6th Class Admissions 2025 : ఏక‌ల‌వ్య‌లో 6వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్.. ఎంపిక విధానం, ముఖ్య‌మైన తేదీలు..!!

3. గతంలో ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా నమోదు చేయాలి.

4. అలాగే ఏ కోర్సుపై ఆసక్తి ఉందనే విషయాన్ని ఎంచుకోవాలి.. దానితో పాటు మరేదైనా ఇతర కోర్సుపై ఆసక్తి ఉంటే దానిని కూడా పొందుపరవచ్చు. ప్ర‌తీ వివ‌రాల న‌మోదు పూర్తి చేసిన త‌రువాత సబ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Jan 2025 10:03AM

Photo Stories