మెరైన్ కెరీర్స్‌కు మార్గం.. ఐఎంయూ.. కోర్సుల్లో ప్రవేశం ఏలా!

షిప్ డిజైన్ నుంచి కస్టమర్ సర్వీస్ వరకు విభిన్న విభాగాల్లో నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశానికి అవసరమైన విద్యను అందిస్తున్న ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (IMU) ప్రతి ఏటా ఐఎంయూ–సెట్ (IMU-CET) ద్వారా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది. తాజాగా ఐఎంయూ–సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఐఎంయూ సెట్ 2025: ప్రధాన వివరాలు
కోర్సులు అందిస్తున్న క్యాంపస్‌లు: చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబై పోర్ట్, నవీ ముంబై, విశాఖపట్నం
అందుబాటులో ఉన్న కోర్సులు:
- బీఎస్సీ నాటికల్ సైన్స్, బీటెక్ (మెరైన్ ఇంజనీరింగ్), బీటెక్ (నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్)
- బీబీఏ (మారిటైమ్ లాజిస్టిక్స్), ఎంటెక్ (మెరైన్ ఇంజనీరింగ్), ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్)
- పీజీ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్, ఎంటెక్ (డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్)
ప్రవేశ విధానం:
ఐఎంయూ–సెట్ ద్వారా: బీటెక్, బీఎస్సీ, డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
చదవండి: Career Opportunities: మ్యాథమెటిక్స్ కోర్సులతో కెరీర్ అవకాశాలు..
ముఖ్యమైన పరీక్ష తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: 2025, మే 2
ఐఎంయూ సెట్ పరీక్ష తేదీ: 2025, మే 24
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
అర్హతలు
బీఎస్సీ/బీటెక్: ఎంపీసీ గ్రూప్‌తో 60% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
ఎంటెక్: 55% మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్ ఉత్తీర్ణత
బీబీఏ: 60% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
ఎంబీఏ: 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ
పరీక్ష విధానం
- యూజీ టెక్నికల్ కోర్సులు: 200 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ
- ఎంబీఏ (PSM/ITLM) కోర్సులు: 120 మార్కులతో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్
- పీజీ టెక్నికల్ ప్రోగ్రామ్స్: ఇంగ్లిష్, మ్యాథ్స్, స్పెషలైజేషన్ ఆధారంగా 120 మార్కుల పరీక్ష
ఉమ్మడి కౌన్సెలింగ్ & అడ్మిషన్
- ఐఎంయూ–సెట్ ర్యాంక్ ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
- CUET–UG, CUET–PG, CAT, GATE, CMAT, MAT ర్యాంకులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
- బీబీఏ ప్రోగ్రామ్ కు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా నేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
కెరీర్ అవకాశాలు
మెరైన్ రంగంలో వివిధ విభాగాలు: షిప్ బిల్డింగ్, షిప్ డిజైన్, షిప్ ఆపరేషన్స్, షిప్ మెయింటెనెన్స్
ప్రముఖ ఉద్యోగ హోదాలు: డెక్ ఆఫీసర్, ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్, ఇంజనీర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ
ప్రారంభ వేతనం: ₹40,000–₹50,000 మధ్య
ప్రముఖ సంస్థలు: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్సార్ షిప్పింగ్, బీఎస్‌ఎం, ఎంఎస్‌ఐ, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్
పూర్తి వివరాలకు: www.imu.edu.in/imunew
Tags
- IMU CET 2025 Notification
- Indian Maritime University Admissions
- IMU CET 2025 Application Form
- Marine Engineering Courses in India
- IMU CET 2025 Exam Date
- Career in Merchant Navy
- Marine Career Opportunities
- IMU CET Eligibility Criteria
- IMU CET Exam Pattern
- Marine Engineering Admission 2025
- Maritime University Admission 2025
- Best Marine Engineering Colleges in India
- IMU CET Syllabus 2025
- IMU CET Results 2025
- How to Apply for IMU CET