Telangana Govt Launches Rajiv Yuva Vikasam Scheme 2025: నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం.. నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలివే!

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవలె ఆయన మాట్లాడారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఆయా వర్గాల కోసం పెట్టిన ఆర్థిక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
TGPSC Group 3 Results 2025 Declared: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసింది
3 లక్షల వరకు ఆర్థిక సాయం
ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని తెస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద ఆయా వర్గాలకు చెందిన యువకులకు వ్యక్తిగతంగా రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఆ రోజు నుంచే ఆన్‌లైన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి, జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని భట్టి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంకు లింకేజీతో రుణం ఇప్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు.
ఐలమ్మ వర్సిటీకి రూ.540 కోట్లు
వీర వనిత చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటు చేసిన మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.540 కోట్లు కేటాయించామని, దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఈ వర్సిటీ ప్రాంగణంలో ఉన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. వర్సిటీ ప్రధాన ద్వారం మూసీ నదిని ఆనుకుని ఉందని, మూసీ పునరుజ్జీవం తర్వాత ఈ ప్రధాన గేటును తిరిగి ప్రారంభిస్తామన్నారు.
DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది ఇదే
వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనుల ప్రారంభానికి తక్షణమే రూ.15.5 కోట్లు, నూతన భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టు భట్టి వెల్లడించారు.
రాజీవ్ యువ వికాసం పథకం.. ముఖ్య వివరాలు:
- నిరుద్యోగ యువతకు రూ. 3 లక్షల వరకు ఆర్థిక సాయం
- నోటిఫికేషన్ విడుదల: మార్చి 15, 2025
- అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తులు ప్రారంభం: నేటి నుంచే (మార్చి 15)
- దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2025
- లబ్ధిదారుల ఎంపిక: ఏప్రిల్ 6 - మే 31
- మంజూరు పత్రాల పంపిణీ: జూన్ 2, 2025 (రాష్ట్ర అవతరణ దినోత్సవం)
Tags
- self employment
- schemes for youth
- Unemployed Youth
- new schemes for unemployed youth
- Rajiv Yuva Vikasam
- Deputy Chief Minister Bhatti Vikramarka
- 6000 crores funds
- jobs for unemployees
- job offers for educated and unemployed
- Sakshi Education News
- Education News
- financial help
- Rajiv Yuva Vikasam Scheme 2025
- SC ST BC minority self employment scheme
- Self Employment Scheme for Unemployed
- How to Apply for Rajiv Yuva Vikasam
- Rajiv Yuva Vikasam Notification 2025
- Telangana Self Employment Scheme Application Process
- Telangana Government Schemes for Unemployed
- Rajiv Yuva Vikasam Eligibility Criteria
- JobOpportunities