TGPSC Group 3 Results 2025 Declared: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసింది
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి.రాష్ట్రంలో 1365 ఈ గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌ఈ గతేడాది నవంబర్‌లో పరీక్షలను నిర్వహించింది.
TGPSC Group 3 Results 2025 Declared News In Telugu
నవంబర్ 17,18వ తేదీల్లో ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో పాటు గ్రూప్-3 పరీక్ష తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.