Skip to main content

TGPSC Group 2 Results : రేపే గ్రూప్‌-2 ఫ‌లితాలు విడుద‌ల‌... అలాగే గ్రూప్‌-3 కూడా.. దాదాపు పోస్టు ఎంపిక‌పై క్లారిటీ ఇలా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1 మార్కుల జాబితాను మార్చి 10వ తేదీన విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే గ్రూప్‌-2 ఫ‌లితాల‌ను కూడా మార్చి 11వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.
TGPSC Group 2, 3 Results Release Date

రేపు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుద‌ల చేయ‌నున్నారు. టీఎస్‌పీఎస్సీ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టుల‌కు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు.

మార్చి 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫ‌లితాలు...
వివిధ పోటీప‌రీక్ష‌లు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించకుండా టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. మార్చి 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫ‌లితాలు వెల్లడిస్తామని ప్రకటించింది. అలాగే మార్చి 14వ తేదీన‌ గ్రూప్-3, మార్చి 17వ తేదీన‌ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మార్చి 19వ తేదీన‌ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Published date : 11 Mar 2025 08:27AM

Photo Stories