Skip to main content

TGPSC Groups 1, 2, 3 Results Date 2025 : గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల మూల్యాంకనం పూర్తి.. అలాగే గ్రూప్‌-2,3 ఫ‌లితాలు కూడా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది.
TSPSC Groups 1 and Group 2 and Group 3 Results   TSPSC Group-1 Mains results update  Telangana Group-1 Mains results announcement soon

ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ ఏక్షణంలోనైన గ్రూప్‌-1 మెయిన్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

ఒక్క పోస్టుకు ఇద్దరిని...
గ్రూప్‌-1 మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో... మెరిట్ జాబితాపై టీఎస్‌పీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది. జనరల్ ర్యాకింగ్ లిస్ట్ విడుదలైతే గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి దాదాపు లైన్ క్లియర్ అవుతోంది.

➤☛ Group 1 Ranker Success Story : సీడీపీఓ, గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా... నా స్టోరీ ఇదే..!

అలాగే గ్రూప్‌-2, 3 ఫ‌లితాల‌ను కూడా...
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను విడుద‌ల చేసిన‌ తర్వాత.., మిగతా గ్రూప్‌-2, 3 పరీక్షల తుది ఫలితాలను ఇవ్వనున్న‌ది. గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే గ్రూప్-3, గ్రూప్-2 ఫలితాలను టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. గ్రూప్-1 ఫలితాలు కాకుండా గ్రూప్-3, 2 ఫలితాలను ప్రకటిస్తే... కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

➤☛ Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

కొత్త‌గా 450 గ్రూప్‌-1, 600-700 గ్రూప్‌-2 పోస్టుల‌కు మ‌రో నోటిఫికేష‌న్...?
ఇప్పటికే గ్రూప్ 2, 3 ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. వీటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా సిద్ధం చేసే పనిలో టీఎస్‌పీఎస్సీ ఉంది. మార్చి చివ‌రికి కీలకమైన గ్రూప్-1, 2,3 ఫలితాలన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫ‌లితాల విడుద‌ల కోసం ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అలాగే రానున్న మే నెల కొత్త‌గా 450 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు, 600-700 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు.

➤☛ IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Published date : 31 Jan 2025 09:06AM

Photo Stories