Skip to main content

TSPSC Group 3 Result 2025 : రేపే గ్రూప్‌-3 ఫ‌లితాలు విడుద‌ల‌... పోటీ ఎలా ఉందంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే గ్రూప్‌-1, 2 మార్కుల జాబితాను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
TSPSC Group 3 Result 2025

ఇక లక్షల మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న‌ది గ్రూప్‌-3 ఫ‌లితాల కోసం. అయితే టీఎస్‌పీఎస్సీ 1,365 గ్రూప్‌-3 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చి... రాత‌ప‌రీక్ష‌ల‌ను కూడా నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

2,69,483 మంది..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మార్చి 14వ తేదీన విడుద‌ల చేసే గ్రూప్‌-3 ఫ‌లితాల‌ను... అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ చూడొచ్చు.

Published date : 13 Mar 2025 01:52PM

Photo Stories