Skip to main content

TSPSC Groups Syllabus Changes : TSPSC గ్రూప్‌-1, 2, 3 ప‌రీక్ష‌ల సిల‌బ‌స్‌లో మార్పులు-చేర్పులు ఇవే..! కొశ్చ‌న్ పేప‌ర్ విధానంలో కూడా..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1, 2, 3 ప‌రీక్ష‌ల సిల‌బ‌స్‌లో మార్పులు చేసే అవ‌కాశం ఉంది. రానున్న గ్రూప్‌-1, 2, 3 కొత్త నోటిఫికేష‌న్‌లో సిల‌బ‌స్‌లో మార్పులు రానున్నాయి. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రణాళిక‌లు చేస్తున్నారు.
TSPSC Groups Syllabus Changes

గ‌త 10 సంవ‌త్స‌రాల క్రితం ప్రొఫెసర్‌ హరగోపాల్ సార‌థ్యంలోని నిపుణుల క‌మిటి టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే ప‌లు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌ను మార్పులు చేర్పులు చేశారు. సాదార‌ణంగా సిల‌బ‌స్ మార్చిన 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లి సిల‌బ‌స్‌లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. 

ఈ సారి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల విధానం మాదిరిగా... తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌లు ఉండే అవ‌కాశం ఉంది. అలాగే కొశ్చ‌న్ పేప‌ర్‌లో విధానంలో కూడా మార్పులు చేసే అవ‌కాశం ఉంది.

మార్చి 10వ తేదీ నుంచి..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాల‌ను మార్చి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం ఐదు నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్‌ ర్యాంకు జాబితాలు, ప్రాథమిక మార్కులను వెల్ల‌డించ‌నున్నారు.

ఈ ఫ‌లితాలు విడుద‌ల త‌ర్వాత‌నే.. సిలబ‌స్‌లో మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం ఉంది. రానున్న మే నెల‌లో గ్రూప్స్-1,2 నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఒక వేళ సిల‌బ‌స్ మారిస్తే.. ఈ కొత్త నోటిఫికేష‌న్‌కు.. కొత్త సిల‌బ‌స్ అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పైన ఉన్న ప‌లు ప్ర‌శ్న‌ల‌కు, సిల‌బ‌స్‌లోని మార్పులు, కొశ్చ‌న్ పేప‌ర్‌లోని మార్పులు ఇలా మొద‌లైన అంశాల‌పై తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ...

Published date : 08 Mar 2025 02:02PM

Photo Stories