Skip to main content

TGPSC Group-1, 2 Results 2025 : గ్రూప్‌-1, 2 ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే...? అలాగే గ్రూప్‌-3 కూడా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1, 2 ఫ‌లితాలను ఈ నెల చివ‌రిలోపు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
TGPSC Group-1, 2 Results 2025   TSPSC Group-1 and Group-2 results announcement

మొద‌టి గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షల‌కు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించనున్నారు. దీని వల్ల గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులు, గ్రూప్-2 లేదా గ్రూప్-3లో కూడా ఎంపికై ఉంటే..., ఇతర అభ్యర్థులకు అవకాశాలు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగాల భర్తీని మరింత సమర్థంగా నిర్వహించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఫ‌లితాల‌ను మాత్రం...
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఫలితాల త‌ర్వాత‌.. గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలను ప్రకటించేలా క‌మిష‌న్‌ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానంతో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే అవకాశమే ఉండదని, ఖాళీల భర్తీ పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published date : 05 Feb 2025 10:11AM

Photo Stories