Skip to main content

TSPSC Group 1, 2, 3 Syllabus Changes : గ్రూప్‌-1, 2, 3 సిల‌బ‌స్‌లో మార్పులు...? ఈ సారి ఎలా ఉంటుందంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1, 2, 3 ప‌రీక్ష‌ల సిల‌బ‌స్‌లో మార్పులు చేసే అవ‌కాశం ఉంది. రానున్న గ్రూప్‌-1, 2, 3 కొత్త నోటిఫికేష‌న్‌లో సిల‌బ‌స్‌లో మార్పులు రానున్నాయి.
TSPSC Group 1 and 2 and 3 Syllabus Changes   TSPSC Group Exams Syllabus Update   Telangana PSC Syllabus Update News  Upcoming Changes in TSPSC Exams  TSPSC Exam Syllabus ModificationTelangana Public Service Commission Notification

ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రణాళిక‌లు చేస్తున్నారు. గ‌త 10 సంవ‌త్స‌రాల క్రితం ప్రొఫెసర్‌ హరగోపాల్ సార‌థ్యంలోని నిపుణుల క‌మిటి టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే ప‌లు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌ను మార్పులు చేర్పులు చేశారు. సాదార‌ణంగా సిల‌బ‌స్ మార్చిన 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లి సిల‌బ‌స్‌లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. కానీ.. క‌శ్చితంగా మర్చాలి అనే రూల్ లేదు. అది ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్ణ‌యం మీద ఆధారప‌డి ఉంటుంది.

అలాగే కొశ్చ‌న్ పేప‌ర్‌లో విధానంలో...
ఈ సారి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల విధానం మాదిరిగా... తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌లు ఉండే అవ‌కాశం ఉంది. అలాగే కొశ్చ‌న్ పేప‌ర్‌లో విధానంలో కూడా మార్పులు చేసే అవ‌కాశం ఉంది.

మార్చి 31వ తేదీలోపు..
మార్చి 31వ తేదీలోపు గ్రూప్‌-1,2,3 ఫ‌లితాలు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ ఫ‌లితాలు విడుద‌ల త‌ర్వాత‌నే.. సిలబ‌స్‌లో మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం ఉంది. రానున్న మే నెల‌లో గ్రూప్స్-1,2 నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఒక వేళ సిల‌బ‌స్ మారిస్తే.. ఈ కొత్త నోటిఫికేష‌న్‌కు.. కొత్త సిల‌బ‌స్ అమ‌లు చేస్తారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) చైర్మన్‌ బుర్రా వెంకటేశం, క‌మిష‌న్ సభ్యులు సిల‌బ‌స్‌లో మార్పులు, ప‌రీక్ష విధానం, కొశ్చ‌న్ పేప‌ర్ విధానంపై ఇంకా ఎలాంటి క్లారీటి ఇవ్వ‌లేదు.

Published date : 06 Mar 2025 03:28PM

Photo Stories