Skip to main content

TGPSC Groups-2,3 Results Release Date 2025 : గ్రూప్‌-2,3 ఫ‌లితాల విడుద‌లపై క్లారిటీ.. రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే గ్రూప్‌-2, 3 ప‌రీక్ష‌ల‌ను ఇటీవ‌లే నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. అయితే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను ఈ నెల చివ‌రిలోపు విడ‌ద‌ల చేస్తామ‌ని.. టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్వ‌యంగా తెలిపారు.
TGPSC Groups-2, 3 Results Release Date 2025

ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లును చేస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ నోటిఫికేష‌న్ ఇచ్చి ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. 5,51,855 మంది గ్రూప్‌ 2కు దరఖాస్తు చేసుకుని.. 2,51,486 మంది మాత్ర‌మే ఈ పరీక్షకు హాజర‌య్యారు.

☛➤ Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

అలాగే 1,363 గ్రూప్-3 పోస్టుల‌కు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,36,400 మందికి గాను 2,69,483 మంది హాజ‌రు అయ్యారు. అంటే గ్రూప్‌-2, 3 ఫ‌లితాల కోసం ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు వేచిచూస్తున్నారు.

అలాగే గ్రూప్‌-1కి కూడా..

31,383 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే ఈ పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది. ఈ గ్రూప్‌-1 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను కూడా వారం రోజుల్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ ఫ‌లితాల విడుద‌ల త‌ర్వాత‌ మ‌రో సారి గ్రూప్స్‌-1, 2, 3 ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు టీజీపీఎస్సీ మ‌రో శుభ‌వార్త‌ చెప్పబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత కొత్తగా మళ్లీ గ్రూప్స్‌-1, 2, 3 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ రాబోతుంది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్వ‌యంగా తెలిపారు.

☛➤ Huge Demand for Jobs in Future : రానున్న రోజుల్లో ఏ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువ‌..? ప‌డిపోయే ఉద్యోగాలివే.. కార‌ణం!!

 

☛➤ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

☛➤ Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

☛➤ Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

☛➤ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

☛➤ Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

Published date : 10 Jan 2025 05:14PM

Photo Stories