Skip to main content

TGPSC No Jobs Notifications 2025 : ఇక‌పై 6 నెల‌ల వ‌ర‌కు ఉద్యోగ‌ నోటిఫికేష‌న్లు లేవ్‌... కార‌ణం ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నుంచి రానున్న 6 నెల‌లో ఎటువంటి నోటిఫికేష‌న్ వ‌చ్చే చాన్స్ కన్పించ‌డం లేదు. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు స్వ‌యంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.
tspsc chairman burra venkatesham  TSPSC Chairman Burra Venkatesham announces no new job notifications for 6 months  Announcement by TSPSC chairman about job notifications after May 1

ఈ లోపు మార్చి 31వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీల గురించిన అన్ని వివరాలు సేకరిస్తామని, వీటి సేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే భర్తీ ప్రక్రియను శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు.

6 నుంచి 8 నెలల్లోగా.. ఎటు వంటి అడ్డంకులు ఎదురయినా..
2025 మే 1 నుంచి నోటిఫికేష‌న్లు జారీ చేసి ఆ తర్వాత 6 నుంచి 8 నెలల్లోగా అన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. అదే విధంగా గ్రూప్-3, గ్రూప్-2 'కీ' విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష ఫలితాలు వచ్చేలా పనిచేయనున్నట్లు ఆయ‌న వెల్లడించారు. ఎటు వంటి అడ్డంకులు ఎదురయినా అనుకున్న సమయానికే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

Published date : 09 Jan 2025 01:13PM

Photo Stories