TGPSC Group 3 Topper: గ్రూప్-3 స్టేట్ టాపర్ అర్జున్‌రెడ్డి గ్రూప్-2లోనూ 18వ ర్యాంక్.. ఈ ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తా!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల్లో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్‌రెడ్డి స్టేట్ టాపర్‌గా నిలిచారు.

టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు గాను 339.239 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
తాజాగా ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో కూడా అర్జున్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంకు వచ్చిన సంగతి విశేషం.
ఇంజినీరింగ్ పూర్తిచేసిన అర్జున్‌రెడ్డి ప్రస్తుతం హవేలిఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మెదక్ కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఆయన, గ్రూప్-2 ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 15 Mar 2025 03:01PM