TSPSC Group 2 Problems : గ్రూప్-2లో ఈ 13000 మంది అభ్యర్థుల సంగతి ఏమిటి...? ఇన్‌వాలిడ్‌కు కారణం ఇదేనా..?

తాజా విడుదల చేసిన గ్రూప్-2 మార్కుల జాబితాలో... 13 వేల మందికిపైగా అభ్యర్థులను ఇన్‌వాలిడ్‌గా ఎందుకు ప్రకటించారని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గ్రూప్-2లో ఆ 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలను ఎందుకు వెల్లడించలేదో తేల్చాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1లో కూడా...
అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అనుమానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి ప్రతినిధులు మార్కి 17వ తేదీన (ఆదివారం) ఎమ్మెల్సీ కవితను కలిశారు. గ్రూప్-1, 2 ఫలితాలపై ఉన్న పలు అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాలను లేవనెత్తాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రూప్స్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు.
ఈ సమస్య వల్లనే..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాతూ... ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగా మూల్యాంకనం చేయలేకపోయారని, దాని ఫలితంగా మారుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాల్‌టికెట్, మెయిన్స్‌కి మరో హాల్‌టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.గ్రూప్-1 పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
Tags
- tspsc group 1 mains marks
- mlc kavitha comments on tspsc group 1
- mlc kavitha comments on tspsc group 2
- mlc kavitha comments on tspsc group 2 news telugu
- mlc kavitha
- brs mlc kavitha demands clarity on Group 1 result
- brs mlc kavitha demands clarity on Group 1 result news telugu
- brs mlc kavitha demands clarity on Group 2 result news telugu
- telangana public service commission
- Telangana Public Service Commission Latest News
- Telangana Public Service Commission latest news on group 2 result
- Telangana Public Service Commission latest news on group 1 result
- tspsc group 1 and group 2 issues
- tspsc group 1 and group 2 issues news telugu
- tspsc group 2 results issue
- tspsc group 1 results issue news telugu
- tspsc group 2 results issue news telugu
- brs mlc kavitha sensational comments on tspsc group 1 and group 2 results
- brs mlc kavitha sensational comments on tspsc group 1 and group 2 results news telugu