Skip to main content

TGPSC Group 2 Topper Success Story : ఈమె గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాల‌కు పరీక్ష రాస్తే విజయం ఖాయమే... కానీ...!

తెలంగాణ‌లో ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు... ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు. వ‌రుస‌గా వ‌చ్చే నోటిఫికేష‌న్లు... వ‌రుస‌గా వ‌చ్చే ఫ‌లితాల‌తో... చాలా మంది మంచి మార్కులు సాధించి... ఉద్యోగాలు పొందుతున్నారు.
TSPSC Group 2 Toppers Divya Success Stories

గ‌తంలో వీఆర్వోగా, జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించి... తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 2025 మార్చి 11వ తేదీన విడుద‌ల చేసిన గ్రూప్‌-2 ఫ‌లితాల్లో దివ్య మోటపల్లి దివ్య రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించారు. ఈ నేప‌థ్యంలో దివ్య స‌క్సెస్ స్టోరీ మీకోసం...

గ్రూప్‌-4 అభ్య‌ర్థులు.. ఇప్పుడు గ్రూప్‌-1,2లో..
తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-1, 2 ఫలితాల్లో ఎంతో మంది పేదింటి బిడ్ద‌లు త‌మ‌ సత్తాచాటారు. కొందరు అభ్యర్థులు ఇది వరకు గ్రూప్‌-4 ఫలితాల్లో ర్యాంకులు సాధించి ఆయా శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు గ్రూప్‌-1, 2లో మంచి మార్కులు సాధించారు.

కుటుంబ నేప‌థ్యం :
బంగారు ఆభరణాల పనిచేసే మోటపల్లి తిరుపతి-భారతి దంపతుల కూతురు దివ్య. బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. 

☛➤ TGPSC Group 1, 2 Ranker Success Story : టీచ‌ర్ టూ... గ్రూప్-1 స్థాయి అధికారిగా అయ్యానిలా.. ఆ సంఘటన న‌న్ను కదిలించింది...

సాధించిన ఉద్యోగాలు ఇవే...
2019లో వీఆర్వోతో పాటు గ్రూప్‌-4 ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్ష రాశారు. అలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్రకటించిన గ్రూప్‌-2 ఫలితాల్లో మోటపల్లి దివ్య రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించారు. కాళేశ్వరం జోన్‌ మహిళా విభాగంలో రెండో ర్యాంక్‌ సాధించారు. తొలుత వీఆర్వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. జూలపల్లి మండలంలో పనిచేశారు. గ్రూప్‌-4 పరీక్ష ఫలితాలు 2021లో ప్రకటించగా రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంక్‌ సాధించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారు.

317 జీవో కింద దివ్యను ధర్మారం తహసీల్దార్‌ కార్యాలయానికి జూనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. గ్రూప్‌-1 లక్ష్యంగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టిన ఆమె.. రెండు నెలల వ్యవధిలోనే గ్రూప్‌-2, గ్రూప్‌ -1 పరీక్షలు నిర్వహించగా రెండింటికి ప్రిపేరయ్యారు.  మార్చి 11వ తేదీ (మంగళవారం ) విడుదలైన గ్రూప్‌-2 ఫలితాల్లో సత్తా చాటారు. అలాగే ఎప్ప‌టికైన గ్రూప్‌-1 ర్యాంక్ సాధించ‌డ‌మే నా ల‌క్ష్యం అంటున్నారు దివ్య‌. క‌ష్ట‌ప‌డి చ‌దివితే.. మ‌నం అనుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగాలను సాధించవ‌చ్చ‌ని నిరూపించారు దివ్య‌.

Published date : 12 Mar 2025 03:21PM

Photo Stories