Skip to main content

Least Marks in Group 1 Exam : గ్రూప్‌-1 మెయిన్స్ ఫ‌లితాల్లో విద్యార్థుల అసంతృప్తి.. ఈ స‌బ్జెక్టులో త‌గ్గాయని ఆవేద‌న‌

ఇటీవ‌ల విడుద‌లైన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Least marks in group 1 telugu language exam leads students anger  TGPSC Group-1 Mains results controversy in Telangana

హైదరాబాద్‌: ఇటీవ‌ల విడుద‌లైన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-1లో అత్యధికంగా 530కి పైబడి మార్కులు వచ్చిన వారున్నారు. అయితే తెలుగు మీడియం కేటగిరీలో 400 మార్కులు దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మాతృభాషలోని వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లిష్ లో పరీక్షలు రాసినవారు టాప్‌లో ఉన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Junior Lecturers : నేడు 1,292 జూనియ‌ర్ లెక్చరర్లకు నియామ‌క ప‌త్రాలు..

క‌నీస మార్కులు కూడా..

మూల్యాంకనంలో ఇంగ్లిష్‌ మీడియంకు ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వారికి తక్కువగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు కనీస మార్కులు వేయలేదని, ఫాక్ట్స్‌ రాసిన వాళ్లకు కొంత మేర మార్కులు ఇచ్చారని చెబుతున్నారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసినవారికి తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు.

Young Farmer Talent : ఇంట‌ర్ ఫెయిల్‌.. పంట‌ల్లో ఉన్న‌త ఫ‌లితం.. ఎస్‌కె 4 ప‌సుపుతో..

ప్రస్తుతం ఇచ్చిన మార్కులతో అంచనా వేస్తే... త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత తుది జాబితా విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 12 Mar 2025 01:26PM

Photo Stories