Skip to main content

TGPSC Group-2 Cutoff Marks : గ్రూప్‌-2 కటాఫ్ మార్కులు ఇవే.. ఈ మార్కులు వ‌స్తే జాబ్ మీదే..! కానీ...

సాక్షి ఎడ్యుకేష‌న్ : 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
TSPSC Group 2 Cutoff Marks   TSPSC Group-2 exam score analysis  TSPSC Group-2 key marks update  TSPSC Group-2 score cutoff details

ఇటీవ‌లే గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు. 

➤☛ TS Government Jobs : కొత్త‌గా 450 గ్రూప్‌-1, 700 గ్రూప్-2 పోస్టుల‌తో పాటు.. 6000 డీఎస్సీ, 10000 పోలీసు జాబ్స్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే...?

ఎన్ని మార్కుల వస్తే గ్రూప్‌-2 జాబ్ వ‌స్తుందంటే...?
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2లో 370 పైన మార్కులు వచ్చిన వారికే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని స‌బ్జెక్ట్ నిపుణులు చెప్పుతున్నారు. గ్రూప్‌-2 కీ లో మూడు మార్కులను టీజీపీఎస్సీ తొలగించింది. దీంతో మొత్తం మార్కులు 600 నుంచి 597 మార్కులకు కుదించారు. అయితే ఓవరాల్ అన్ని పేపర్లలో కలిపి 350 మార్కులు దాటితే మంచి స్కోర్ అనే చెప్పవచ్చు.

టీఎప్‌పీఎస్సీ గ్రూప్‌-2 కటాఫ్ ఇలా...?

➤☛ ఓపెన్ కేట‌గిరి కటాఫ్ : 365 మార్కులు ఉండోచ్చు

➤☛ బీసీ-ఏ: 345 మార్కులు

➤☛ బీసీ-బీ: 355 మార్కులు

➤☛ బీసీ-సీ: 345 మార్కులు

➤☛ బీసీ-డీ: 355 మార్కులు

➤☛ బీసీ-ఈ: 345 మార్కులు

➤☛ ఎస్సీ: 335

➤☛ ఎస్టీ: 335

➤☛ ఈడబ్ల్యూఎస్: 335

పై మార్కులు 8-15 అటు ఇటు కటాఫ్ ఉండే అవకాశాలున్నాయి. 350, 360 మార్కులు దాటిన వారందరూ ఉద్యోగంపై ఆశ‌ పెట్టుకోవచ్చు.

మ‌రో గ్రూప్‌-1, 2 ఉద్యోగాల‌కు భారీ నోటిఫికేష‌న్‌...
ఈ సారి గ్రూప్‌-2 ఉద్యోగం రాని వారు ఎలాంటి నిరుత్సాహ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే... ఈ మే నెల‌లోనే.. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా దాదాపు 450 గ్రూప్‌-1 పోస్టుల‌కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే 600-700 గ్రూప్‌-2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న‌ వివిధ శాఖ‌ల్లోని గ్రూప్-1, 2 పోస్టుల‌ను ప్ర‌భుత్వ సేక‌రిస్తోంది. మే లేదా జూన్ నెల‌లో ఈ గ్రూప్‌-1,2 ఉద్యోగాల‌కు కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఉన్న గ్రూప్‌-1,2 ఫ‌లితాల విడుద‌ల అనంతం కొత్త‌గా మ‌రో సారి గ్రూప్‌-1,2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

Published date : 23 Jan 2025 08:55AM

Photo Stories