Skip to main content

TSPSC Group 2 Jobs 2024 : TSPSC Group 2 Cut off మార్కులు ఇంతేనా..? | TSPSC Group 2లో ఎన్ని మార్కులు వ‌స్తే జాబ్ వ‌స్తుందంటే..?

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు ప‌రీక్ష‌లను నిర్వ‌హించారు. గ్రూప్‌-2 పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వ‌హించారు.
TSPSC Group 2 Exam Jobs 2024  Discussion of TSPSC Group-2 cutoff marks analysis

అలాగే డిసెంబరు 16వ తేదీన పేపర్-​3 ప‌రీక్ష‌ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వ‌ర‌కు, పేప‌ర్‌-4 పరీక్షను మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వ‌హించారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించారు. మొత్తం 600 మార్కులు ఈ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. 

➤☛ TSPSC Group-2 Question Paper 1 With Key 2024 : గ్రూప్‌–2 పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇవే...

➤☛ TSPSC Group-2 Question Paper 2 With Key 2024 : గ్రూప్‌–2 పేప‌ర్-2 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ 2024 ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇవే...

ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 16వ తేదీన గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు ముగిసాయి. ఈ ప‌రీక్షలు ఎలా జ‌రిగాయి..? TSPSC Group-2లో ఎన్ని మార్కులు వ‌స్తే జాబ్ వ‌స్తుందంటే...? TSPSC Group 2 క‌టాఫ్ మార్కులు ఎంత‌...?  ఏఏ పేప‌ర్ క‌ఠినంగా వ‌చ్చింది...? మొద‌లైన అంశాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ప్ర‌త్యేకంగా ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత‌ పరీక్ష‌కేంద్ర నుంచి వ‌చ్చిన‌ అభ్య‌ర్థులు అభిప్రాయాల‌ను సేక‌రించి.. వీటిని వీడియో రూపం మీకోసం అందిస్తోంది..

Published date : 17 Dec 2024 08:47AM

Photo Stories