Group 1-2-3-4 Ranker: గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలన్నింట్లోనూ ర్యాంకులు.. శభాష్ హవల్దారి శ్రీనాథ్!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: టీజీపీఎస్సీ గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలన్నింటిలోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించి హవల్దారి శ్రీనాథ్ ప్రతిభ చాటాడు.

నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన శ్రీనాథ్, గ్రూప్–1లో 454.5 మార్కులతో ర్యాంకు, గ్రూప్–2లో స్టేట్ 68వ ర్యాంకు, గ్రూప్–3లో 88వ ర్యాంకు, గ్రూప్–4లో 136వ ర్యాంకు సాధించాడు.
ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేస్తున్న శ్రీనాథ్ ఈ విజయానికి తన తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహమే కారణమని పేర్కొన్నాడు. పోటీ పరీక్షలకు లక్ష్యంగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు తన విజయ ప్రయాణం ప్రేరణగా నిలుస్తుందని తెలిపాడు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 15 Mar 2025 03:15PM