TGPSC Group 3 Results: గ్రూప్–3లోనూ పురుషులే ‘టాప్’.. టాప్ 10 ర్యాంకులకు వచ్చిన మార్కులు ఇలా!

గ్రూప్-2 ఫలితాల మాదిరిగానే, ఈసారి కూడా పురుషులే టాప్ ర్యాంకులు సాధించారు. టాప్ 10 ర్యాంకుల్లో కేవలం ఒక మహిళ మాత్రమే ఉన్నారు, ఇక టాప్ 92లో 10 మంది మహిళలు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
టాప్ 10 ర్యాంకులకు వచ్చిన మార్కులు
ర్యాంకు |
మార్కులు |
1 |
339.239 |
2 |
331.299 |
3 |
330.427 |
4 |
329.179 |
5 |
327.245 |
6 |
326.272 |
7 |
326.225 |
8 |
325.157 |
9 |
323.184 |
10 |
323.157 |
మహిళా అభ్యర్థుల టాప్ 10 ర్యాంకులు
ర్యాంకు |
మార్కులు |
8 |
325.157 |
37 |
312.11 |
46 |
309.184 |
47 |
309.157 |
51 |
308.124 |
55 |
307.097 |
70 |
305.056 |
77 |
304.103 |
82 |
303.076 |
92 |
301.239 |
గ్రూప్-3లో 18 వేల మందికి అనర్హత
TSPSC 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా, 2,67,921 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే, 18,364 మంది అనర్హులుగా తేలడంతో, 2,49,557 మంది అభ్యర్థుల జాబితా మాత్రమే జారీ చేసింది.
TSPSC వెబ్‌సైట్‌లో జనరల్ ర్యాంకింగ్ లిస్టు (GRL), ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
చదవండి: SI to Group 1: ఎస్సై మాధవ్‌గౌడ్‌కు గ్రూప్–1 ఉద్యోగం.. ఈ పోస్టు వచ్చే అవకాశం!
ఖాళీ పోస్టులు పెరిగే అవకాశం
గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో టాప్ ర్యాంకు సాధించిన అభ్యర్థుల్లో చాలామంది గ్రూప్-3లో కూడా అర్హత సాధించారు. వీరిలో కొంతమంది గ్రూప్-1 లేదా గ్రూప్-2 ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉండటంతో, గ్రూప్-3లో కొన్ని పోస్టులు మిగిలిపోవచ్చు. అలాగే, ఇప్పటికే గ్రూప్-4 ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులు గ్రూప్-3లో ఎంపికైతే, తమ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలే అవకాశం ఉంది.
మరిన్ని ఫలితాల విడుదల తేదీలు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు : మార్చి 17
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు: మార్చి 19
గ్రూప్-3 ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని TSPSC స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు ప్రాథమిక ఎంపిక జాబితా త్వరలో విడుదల కానుంది.
TSPSC హెల్ప్‌డెస్క్ సమాచారం:
ఫోన్ నంబర్లు: 040–23542185, 040–23542187
ఈమెయిల్: helpdesk@tspsc.gov.in
![]() ![]() |
![]() ![]() |