Skip to main content

TGPSC Competitive Exams Ranks 3–7–27–27: అన్ని పోటీ పరీక్షల్లో ర్యాంక్‌లు.. చంద్రకాంత్‌ అద్భుత ప్రదర్శన!

సాక్షి ఎడ్యుకేషన్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు చంద్రకాంత్‌ పోటీ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.
tspsc group2 group3 top ranker chandrakant success story

గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4, జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి, విజేతగా నిలిచారు.

గ్రూప్‌–3: 7వ ర్యాంకు (మార్చి 14 ఫలితాలు)
గ్రూప్‌–2: 27వ ర్యాంకు (మార్చి 11 ఫలితాలు)
గ్రూప్‌–4: 27వ ర్యాంకు (కొన్నాళ్ల క్రితం ప్రకటిత ఫలితాలు)
జూనియర్‌ లెక్చరర్‌: స్టేట్‌ 3వ ర్యాంకు

చదవండి: TGPSC Group 3 Topper: గ్రూప్-3 స్టేట్ టాపర్ అర్జున్‌రెడ్డి గ్రూప్-2లోనూ 18వ ర్యాంక్.. ఈ ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తా!
చంద్రకాంత్‌ మార్చి 12న రవీంద్రభారతిలో తెలంగాణ సీఎం చేతుల మీదుగా జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగ నియామక పత్రం అందుకున్నారు. ప్రతిభను నిరూపించుకున్న చంద్రకాంత్‌పై అభినందనల వర్షం కురుస్తోంది.

Published date : 15 Mar 2025 02:34PM

Photo Stories