Skip to main content

TSPSC Group 4 Results Update : నాలుగు రోజుల్లో.. గ్రూప్ 4 ఫలితాలు విడుద‌ల‌.. సర్వం సిద్ధం.. కానీ స‌మ‌స్య ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం 6,956 మందికి స్టాఫ్‌ నర్స్ ఉద్యోగాల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి.. వీరికి నియామక పత్రాల‌ను కూడా అందజేసింది. ఈ దిశ‌గానే మూడు నాలుగు రోజుల్లో టీఎస్‌సీఎస్సీ కూడా గ్రూప్‌-4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
TSPSC Group 4 Results

ఇటీవ‌లే కొత్త ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ బోర్డ్ స‌భ్యులు గ్రూప్‌-4 ఫ‌లితాల విడుద‌లకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు ప్రారంభించింది.

ప్రభుత్వం అనుమతి తీసుకోని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల్లోనే గ్రూప్-4 ఫలితాలు విడుదల చేసేందుకు ముమ్మరం చేసింది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

ముందుగా జనరల్ ర్యాంకు లిస్టును..
8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.  ఈ గ్రూప్‌-4 ప‌రీక్ష‌ను జూలై 1వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేయగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఫైనల్ కీ కూడా విడుద‌ల చేశారు. ఇక గ్రూప్-4 తుది ఫలితాలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ గ్రూప్‌-4 ఫ‌లితాల కోసం దాదాపు 7.6 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాలు విడుదల చేసే ప్రక్రియ మాత్రం బోర్డు పూర్తి చేసింది. ఇక నాలుగైదు రోజుల్లో గ్రూప్-4 ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టును ప్రకటించి.. ఆ తర్వాత పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

గ్రూప్-4 ఎగ్జామ్‌ను రద్దు చేయాలని..?

tspsc group 1 results cancelled news telugu

TSPSC నిర్వహించిన గ్రూప్-4 ఎగ్జామ్‌ను రద్దు చేయాలని ప్రొఫెసర్ కోదండరాంను కలిసి కొంద‌రు అభ్య‌ర్థులు విన‌తి  ప‌త్రం ఇచ్చారు. ఎందుకంటే గ్రూప్-4 ఎగ్జామ్ పారదర్శకంగా జరగలేదని.., బయోమెట్రిక్  తీసుకోలేదని, ఓఎంఆర్ షీట్ పైన ఫోటో ఐడెంటిటీ రాలేదు అన్నారు. 963 ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినయ్ కాబట్టి ఈ ఎగ్జామ్ నువ్వు రద్దు చేసి ఇంకో కొత్త నోటిఫికేషన్ లో 3000 ఉద్యోగాలను కలిపి  భారీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోదండరాం అభ్య‌ర్థులు కోరడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రూప్‌-4 ఎగ్జామ్‌ని రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో గ్రూప్-4 తుది ప‌లితాలు విడుద‌ల అవుతాయో.. లేదో అనే అయోమ‌యంలో అభ్య‌ర్థులు ఉన్నారు.

Published date : 03 Feb 2024 05:55PM

Photo Stories