Group 4 Job: గ్రూప్– 4 ఫలితాల్లో మెరిసిన సంతోష్
Sakshi Education
తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన మెట్‌పల్లి రాజు–మంజుల దంపతుల కుమారుడు సంతోష్‌కుమార్ గ్రూప్– 4 ఫలితాల్లో మెరిశాడు.
ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేసిన సంతోష్ 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.
చదవండి: Naresh: గెజిటెడ్ హోదా కొలువు సాధించిన జీపీ కార్మికుడి కూమారుడు
ఇటీవల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మెరిట్ లిస్టులో జోన్–2లో నాలుగో ర్యాంకు సాధించాడు. ఈ కొలువు సైతం దాదాపుగా దక్కినట్లే. అలాగే ఇటీవల గ్రూపు–1 మెయిన్స్ పరీక్షలకు సైతం హాజరయ్యాడు. తనకు అఖిల్ బుద్ధి స్ఫూర్తి అని, తన తదుపరి లక్ష్యం ఐఏఎస్ అని అంటున్నాడు సంతోష్‌కుమార్.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 19 Nov 2024 10:23AM