Skip to main content

TSPSC-RIMC Admissions: ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. పరీక్షా విధానం, దరఖాస్తు విధానం ఇలా..

డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో (ఆర్‌ఐఎంసీ) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి ఉన్న వారు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
TSPSC-RIMC Admissions News In Telugu   RIMC Dehradun admission notification for Class 8  Apply for RIMC Class 8 admissions before March 31  Rashtriya Indian Military College admission notice
TSPSC-RIMC Admissions News In Telugu

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 01.­01. 2026 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2026 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.

పరీక్ష విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమేటిక్స్‌(200 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌(75 మార్కులు), ఇంగ్లిష్‌(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్‌(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వాయిస్‌ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్‌ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి SCERT డైరెక్టర్‌,ఎల్బీ స్టేడియం ఎదురుగా, ఈ-గేట్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. 


దరఖాస్తులకు చివరితేది: మార్చి 31, 2025.

వెబ్‌సైట్‌: https://rimc.gov.in/

Published date : 15 Mar 2025 08:56AM
PDF

Photo Stories